బీన్స్ గ్రేవీ కర్రీ యమ్మీ….

Posted November 19, 2016

beans gravy curry making process
కావలసినవి:
బీన్స్‌ ముక్కలు(అంగుళంసైజువి): 2 కప్పులు, దాల్చినచెక్క: అర అంగుళం ముక్క, యాలకులు: మూడు, లవంగాలు: మూడు, కారం: ముప్పావు టీస్పూను, నూనె: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా

గ్రేవీ మసాలాకోసం: ఉల్లిముక్కలు: కప్పు, టొమాటోముక్కలు: కప్పు, అల్లం: అంగుళంముక్క(సన్నగా తరగాలి), జీలకర్ర: ముప్పావు టీస్పూను, మిరియాలు: నాలుగు, కరివేపాకు: 6 రెబ్బలు, కొత్తిమీర తురుము: కట్ట

తయారుచేసే విధానం:
బాణలిలో టేబుల్‌స్పూను నూనె వేసి ఉల్లిముక్కలు వేసి వేయించి, టొమాటోముక్కలు, ఉప్పు వేసి ఉడికించాలి. తరవాత కారం వేసి ఓ రెండు నిమిషాలు వేయించి, చల్లారాక మిక్సీలో వేయాలి. వీటితోపాటు అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు, ఓ కప్పు నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. మరో బాణలిలో మిగిలిన నూనె వేసి దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేసి ఓ నిమిషం వేయించాక బీన్స్‌ ముక్కలువేసి ఉప్పు చల్లాలి. ఓ కప్పు నీళ్లు పోసి మూతపెట్టి మధ్యమధ్యలో తిప్పుతూ ఉడికించాలి. ముక్కలు ఉడికిన తరవాత రుబ్బిన మసాలా వేసి సిమ్‌లో గ్రేవీ చిక్క బడేవరకూ ఉడికించి దించాలి. టేస్టీ టేస్టీ కర్రీ రెడీ