భారతి వర్సెస్ బ్రాహ్మణి… 2019 వార్

0
87

Posted April 23, 2017 at 12:36

bharathi verses brahmaniఏపీలో మరో ఇద్దరు ఛరిష్మాటిక్ లీడర్లు తెరంగేట్రం చేయనున్నారు. రాజకీయ కుటుంబాలకు చెందిన నారా బ్రహ్మణి, వైఎస్ భారతి 2019 ఎన్నికల నాటికి ఆయా పార్టీలకు తురుపుముక్కలుగా మారబోతున్నారు. నిజానికి బ్రహ్మణి ఆరంగేట్రం.. భారతి నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళ్లాల్సి వస్తే.. భారతిని దించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు భారతికి పోటీగా బ్రహ్మణిని ప్రచారంలోకి దించితే.. తమకు తిరుగుండదని టీడీపీ అధిష్ఠానం ఆలోచనగా ఉంది.

ప్రస్తుతం జగన్ బెయిల్ రద్దు వాదనలు సీబీఐ కోర్టులో ముగిశాయి. తీర్పు వాయిదా పడింది. టీడీపీ అంచనా ప్రకారం.. జగన్ జైలుకు వెళ్లాలని కోర్టు తీర్పు చెప్పే అవకాశం ఉంది. అటు కేంద్రంతో కూడా బాబు రాయబారం చేశారని, జగన్ కు జైలే శరణ్యమని టీడీపీ నేతలు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన జగన్ కీడెంచి మేలేంచుతున్నారు. ఎందుకైనా మంచిదని భార్య భారతిని రాజకీయాల్లోకి తేవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. సాక్షిని సమర్థంగా నడిపిస్తున్న భారతి.. పార్టీని కూడా బాగా నడుపుతారని జగన్ నమ్మకంగా ఉన్నారు.

ఇక బ్రహ్మణి ప్రతిభ గురించి ఇప్పటికే టీడీపీ నేతలకు ఎన్నో అంచనాలున్నాయి. సైలంట్ గా తన పని తాను చేసుకుపోతారని, చాప కింద నీరులా చొచ్చుకెళ్తారన్న పేరు బ్రహ్మణికి ఉంది. భారతి లాంటి మహిళా నేతను ఫేస్ చేయాలంటే.. బ్రహ్మణి లాంటి క్లీన్ ఇమేజ్, కుటుంబ గౌరవం ఉన్న మహిళా నేత అవసరం ఎంతో ఉందంటున్నాయి టీడీపీ వర్గాలు. బ్రహ్మణికి కావాల్సినన్ని లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. పైగా నారా, నందమూరి కుటుంబాలకు కావల్సిన అమ్మాయి. ప్రత్యర్థులు కూడా అంత త్వరగా ఈమెపై విమర్శలు చేయలేరు. అందుకే టీడీపీ వ్యూహాత్మకంగా ఆలోచిస్తేంది. ఇదే జరిగితే.. 2019 ఎన్నికల ప్రచారంలో భారతి వర్సెస్ బ్రహ్మణి సీన్ బాగా పండుతుందంటున్నారు విశ్లేషకులు.