మందును మరిపించిన రసగుల్ల..!

 Posted November 12, 2016bihar people eating rasagulla for avoid alcohol
నిత్యం మందు తాగేవాడు.. ఆ వ్యసనాన్ని ఆపేస్తే ఏమవుతుంది.. దానికి ప్రత్యామ్నాయంగా ఏం తింటాడు.. తినిపిసాడుమీకు తెలుసా.. రసగుల్ల స్వీట్‌ తింటాడట.. అదేంటి మందు మానే స్తే స్వీటు తినడమేంటి విడ్దూరంగా అని అనుకుంటున్నారా.. నిజమండీ.. ఈ విషయం ఎవరో తెలియని వారు చెప్పడం కాదు సాక్ష్యాత్తు ఒక రాష్ట్ర సీఎం వెల్లడించారు. బీహార్‌లో గత ఏడు నెలలుగా మద్య నిషేధం అమలులో ఉండటంతో మందుబాబులు రసగుల్లా స్వీటు ఎక్కువగా కొంటున్నారట.. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌ స్వయంగా వెల్లడించారు. మద్యనిషేధం వల్ల రసగుల్ల అమ్మకాలు 16.25 శాతం పెరిగాయని ఒక సభలో ప్రసంగిస్తూ అక్కడివారికి తెలియజేశారు. ఈ విషయం విన్నవారు.. మందుకి రసగుల్లకు సంబంధం గురించి చర్చించించుకుంటున్నారు.. మందుమానేసి భర్త రాత్రి ఇంటికెళ్లేటప్పుడు భార్యకు తీసుకెళ్లేందుకే అమ్మకాలు పెరిగాయా అంటూ చమత్కరిస్తున్నారు.