అంధ‌కారంలో ఏపీ బీజేపీ!!

Posted February 2, 2017

bjp become down in ap
ప్ర‌త్యేక హోదా పోరు ర‌గులుతున్న త‌రుణంలో కేంద్రం కొంతైనా క‌రుణిస్తుంద‌ని ఎంతో ఆశిస్తే… మ‌ళ్లీ మొండిచెయ్యే మిగిలింది. అరుణ్ జైట్లీ ఏపీని పూర్తిగా లైట్ తీసుకున్నారు. గ‌తంలో ఇచ్చిన హామీలేవీ బడ్జెట్లో క‌నిపించ‌లేదు. హోదా పోరు నేప‌థ్యంలో ప్ర‌త్యేక ప్యాకేజీ అంశంపై జైట్లీ క్లారిటీ ఇస్తార‌ని ఆశించినా ఫ‌లితం లేకుండా పోయింది. ఇక రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి ఏమాత్రం స‌హ‌కరిస్తారో చెప్ప‌కుండా… ఆ ఊసే ఎత్త‌లేదు. విశాఖ రైల్వే జోన్ ముచ్చ‌టే లేదు.

అరుణ్ జైట్లీ బ‌డ్జెట్ లో ఏపీలో ఇక బీజేపీ ఫ్యూచ‌ర్ ఏంటో డిసైడ్ అయిపోయిందన్న వాద‌న వినిపిస్తోంది. కాంగ్రెస్ లా బీజేపీకి కూడా జ‌నం త‌గిన శాస్తి చేయ‌డం ఖాయమ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో కాంగ్రెస్ కూడా రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీని దారుణంగా దెబ్బ‌కొట్టింది. దీనికి జ‌నం స్ట్రాంగ్ రియాక్ష‌న్ ఇచ్చారు. కాంగ్రెస్ ను జీరో చేసి … త‌మ స‌త్తాను చాటారు. ఇప్పుడు ప్ర‌త్యేక హోదా అటుంచి.. క‌నీసం ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యంలోనైనా క్లారిటీ లేక‌పోవ‌డంతో జ‌నంలో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్యాకేజీ అంటే ఎన్ని నిధులిస్తారో.. ఈ బ‌డ్జెట్ లో కొంతైనా క్లారిటీ ఇస్తే బావుండేది. కానీ ఆ మాటే ఎత్త‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

ప్ర‌స్తుతం కేంద్రంలో మోడీదే హ‌వా. ఈ టైంలోనే ఏపీకి న్యాయం జ‌ర‌గ‌డం లేదంటే.. వ‌చ్చే రెండున్న‌రేళ్ల‌లోనూ ఆయ‌న ఏపీకి ఏమైనా ఇస్తార‌ని ఆశ‌లు పెట్టుకోవ‌డం కూడా వేస్ట్. అందుకే ఇక ఏపీలో బీజేపీకి ఫ్యూచ‌ర్ క‌ష్ట‌మేనన్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మోడీ ఏదైనా అద్భుతం చేస్తే త‌ప్ప క‌మ‌లం పార్టీ బ‌త‌క‌డం క‌ష్ట‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. అటు టీడీపీ కూడా బీజేపీ తీరుపై అసంతృప్తిగా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌మ‌లంతో పొత్తుకు కూడా చంద్ర‌బాబు నిరాక‌రిస్తే… ఆ పార్టీకి క‌ష్ట‌మే. ఎందుకంటే పొత్తువ‌ల్లే ఆ పార్టీకి అంతో ఇంతో సీట్లొచ్చాయి. టీడీపీ కూడా చేజారితే ఇక బీజేపీ కూడా జీరోగా మిగిలిపోవ‌డం ఖాయమంటున్నారు విశ్లేష‌కులు.