కమలం ప్లానేస్తే అంతే..

0
89

Posted April 20, 2017

bjp had a hit record everywhereఅది యూపీ అయినా ఎంపీ అయినా, రాజస్థాన్ అయినా కర్ణాటక అయినా.. చివరకు తమిళనాడు అయినా.. ఎక్కడైనా గాలం వేస్తే చేప చిక్కాల్సిందే. కాంగ్రెస్ దారిలో జాతీయ పార్టీగా ఎదిగిన బీజేపీ.. ఇప్పుడు హస్తాన్ని మించి రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న నాయకత్వ శూన్యతను మోడీ సొమ్ము చేసుకుంటుంటే.. ఇప్పుడు తమిళనాడులో ఉన్న నాయకత్వ లేమిని అవకాశంగా వాడుకుంటోంది బీజేపీ. జయలలిత బతికున్నాళ్లూ ఆమె అనుమతి లేకుండా తమిళ గడ్డపై కాలు మోపడానికి కూడా వెనుకాడిన బీజేపీ.. ఇప్పుడు ఏకంగా సీఎం అభ్యర్థిని డిసైడ్ చేసే స్థాయికి ఎదిగింది.

జయ మరణం తర్వాత పన్నీర్ తిరుగుబాటు, తర్వాత పళని సర్కారుకు ఇబ్బందులు, ఆర్కేనగర్ ఉపఎన్నిక రద్దు. దినకరన్ కు కేసుల ఉచ్చు.. ఇవన్నీ యథాలాపంగా జరుగుతున్నట్లు అస్సలు కనిపించడం లేదు. దీని వెనుక కర్త, కర్మ, క్రియ కేంద్రమేననేది తమిళుల మాట. అందులో కొంత వాస్తవం లేకపోలేదు. పన్నీర్ ను తమ దారికి తెచ్చుకున్న బీజేపీ.. రాష్ట్రంలో తమ కనుసన్నల్లో నడిచే సర్కారు ఉండాలని కోరుకుంటున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమిళ సర్కారుకు కూడా కేంద్రం అండదండలు అవసరమే.

అందుకే పన్నీర్ పై తుపాకీ పెట్టి పళనిని టార్గెట్ చేసింది బీజేపీ. చిన్నమ్మను జైలు పంపింది. దినకరన్ కు చెరసాల దారి చూపిస్తోంది. పళని సీఎం కుర్చీ దిగకపోతే అతడికీ అదే గతి పడుతుందని బెదిరిస్తోంది. అటు పళనిస్వామి తనపై కేసుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాక్షాత్తు సీఎం స్థాయి వ్యక్తి.. ఉపఎన్నిక కోసం జనానికి డబ్బులు పంచడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ కేసు తర్వాత పళనిస్వామికి ఉన్న ఎమ్మెల్యేల మద్దతు కూడా వేగంగా పడిపోతోంది. అందుకే వేరే దిక్కులేక పన్నీర్ తో రాజీకి సిద్ధపడ్డారు పళని. దటీజ్ బీజేపీ.