భక్తికి ,రక్తి కి ఆ నోట్లు….

Posted November 12, 2016

black money holders used black money for devotion and sex girl purposeనల్ల ధనాన్ని ఎలా ఖర్చు చేయాలో తెలియక బ్లాక్ కోబ్రా లు నానా తంటాలు పడుతున్నారు .తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా ప్రార్ధన మందిరాల్లో,గుడుల్లో విరాళాలుగా ఇస్తున్న వారు కొందరైతే ,మరికొందరు కనీసం మానవత్వం లేకుండా వేశ్య వృత్తిలో ఉన్న సెక్స్ వర్కర్లకు ఇస్తున్నారు .ముంబై ,కొలకత్తా ,చెన్నై, వంటి మహానగరాల్లో ఈ తరహా నగదు మార్పిడి వ్యవహారం జరుగుతోంది.

ఏదొక రకంగా నల్ల ధనాన్ని వదిలించుకోవాలనే పనిలో భాగంగానే ఈ తరహాలో విరాళాలు , విలాసాలకు అధిక మొత్తాన్ని ఇచ్చి వదిలించుకోవటం ఒక ప్రక్రియ కాగా, ఒడిస్సా , బీహార్ వంటి ప్రాంతాల్లో గిరిజనుల బ్యాంకు అకౌంట్ లను రెండు నుంచి మూడు వేల రూపాయలకు కొని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసి నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మారుస్తున్నారు. ఇదిలా ఉండగా కర్ణాటక రాష్ట్రము లోని చిక్ మంగుళూరు లో నకిలీ నోట్లు కలకలం జరుగుతోంది. ఇదంతా చూస్తుంటే డబ్బుకి జనం ..మనం దాసోహం అనాల్సిందే తప్పదు. కూటి కోసం కోటి విద్యలు ఒకప్పుడు మరి ఎప్పుడు ధనం మూలం ఇదం జగత్ …..