అతడి మాటలు ‘బాహుబలి 2’పై అంచనాలు పెంచేస్తున్నాయి

0
110

Posted April 27, 2017 at 16:25

bollywood censor board member interview about bahubali 2 movie
‘బాహుబలి 2’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రేపు భారీగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అన్ని చోట్ల కూడా సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా హిందీ సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. హిందీ సెన్సార్‌ బోర్డు సభ్యుడైన ఒకరు సెన్సార్‌ తర్వాత సినిమా గురించి డీఎన్‌ఏ అనే మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ‘బాహుబలి 2’పై పొగడ్తల వర్షం కురిపించారు. అద్బుతమైన సినిమా అంటూ, రికార్డులు నమోదు చేయడం ఖాయం అంటూ ఆయన మాటల్లో అర్థం అవుతుంది.

‘బాహుబలి 2’ హిందీ సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడే మూడు గంటల ‘బాహుబలి 2’ సినిమా సెన్సార్‌ పూర్తి అయ్యింది. ఒక్క కట్‌ కూడా లేకుండా ఓకే చెప్పాం. సినిమా ఒక హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంది. హాలీవుడ్‌లో తెరకెక్కి ఇటీవల వచ్చిన ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 8’ కంటే కూడా ఈ సినిమా మరింత అద్బుతంగా ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. యుద్ద సన్నివేశాలు హాలీవుడ్‌ సినిమాలను మించాయని, విజువల్‌ ఎఫెక్ట్‌ మరియు టేకింగ్‌ కూడా అద్బుతంగా ఉందని, ఈ దశాబ్దపు అతి పెద్ద సినిమాగా ‘బాహుబలి 2’ నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఆయన మాటలతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో ‘బాహుబలి 2’పై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఆయన మాటలు ఖచ్చితంగా సినిమా కలెక్షన్స్‌ను భారీగా పెంచడానికి ఉపయోగపడతాయని అంటున్నారు.