రేషన్ షాప్ కెళ్తున్న బాలీవుడ్ హీరోయిన్లు..

 bollywood heroines going ration shop uttara pradesh

కోట్లకుకోట్లు సంపాదించే బాలీవుడ్ బడా హీరోలు,హీరోయిన్లు నెలనెలా రేషన్ షాప్ కెళ్ళి సరుకులు తెచ్చుకుంటారట.ఈ జాబితాలో వున్నవాళ్లు ఆషామాషీ వాళ్ళేమీ కాదు..వారిలో దీపికా పదుకొనె,సోనాక్షి సిన్హా ,రాణి ముఖర్జీ ,జాక్వెలిన్ ఫెర్నాండెస్ వున్నారు.పాపం ..వాళ్లకి అంత కక్కుర్తి లేదులెండి.వాళ్ళ పేరుతో ఓ రేషన్ షాప్ డీలర్ ఉత్తరప్రదేశ్ లో చేసిన మాయ ఇది.ఆయనగారు ఊరి జనానికి సరుకులు సరిగా ఇవ్వకుండా హీరోయిన్ల పేరుతో రేషన్ కార్డులు సృష్టించాడు.నెలనెలా వాళ్లే వచ్చి సరుకులు తీసుకెళ్తున్నట్టు రికార్డులు రాసిపెట్టాడు.

అయ్యగారి వ్యవహారం మీద డౌట్ వచ్చిన ఊరి జనం అధికారులకి ఫిర్యాదు చేశారు.వాళ్ళు వచ్చి తనిఖీలు చేయగానే రేషన్ డీలర్ అక్రమాలు బయటపడ్డాయి.ఏకంగా బాలీవుడ్ హీరోయిన్ల పేరుతో సాగుతున్న అక్రమాల్ని బయట పెట్టారు.