మండల కమిటీ నియామకం వచ్చా నీకు ..బొత్స

Posted November 18, 2016

botsa fires on nara lokesh are you know mandala committee recruitmentమండల కమిటీ ని నియమించటం కూడా చేతకాని వాడు లోకేష్ అని వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు . అయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కొత్త నిర్వచనం చెప్పారని, ఎన్నికల్లో డబ్బు ఇస్తే తప్పు లేదని చెప్పించారని అన్నారు. ఓటుకు నోటు కేసులో నా వాయిస్ కాదు, రేవంత్‌కు డబ్బు ఇవ్వలేదని ఎందుకు అనడం లేదని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు…

అనంతరం నోట్ల రద్దుపై మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్యులు రోడ్డున పడ్డారని బొత్స అన్నారు.టీడీపీ నేతలు ముందే బ్లాక్‌మనీని వైట్ చేసుకున్నారని, ముందస్తు సమాచారంతో హెరిటేజ్‌ను అమ్ముకున్నారని ఆయన అన్నారు. హోదా విషయాన్ని చిన్నగా పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు .