బోయపాటికి చిరు ముద్దు..పవన్ వద్దా?

Posted September 22, 2016

 boyapati movie chiru fix pawan kalyan movie no do

కొరటాల,పోసాని లాంటి వాళ్ళ విమర్శలు ఎదుర్కొంటున్న టైం లోనే బోయపాటికి గోల్డెన్ ఛాన్స్ దక్కింది.దర్శకులంతా ఎవరితో సినిమా చేయాలని కలలు కంటారో అలాంటి ఇద్దరు టాప్ హీరోలు చిరంజీవి,పవన్ కళ్యాణ్ తో సినిమా చేయమని ఒకేసారి పిలుపొచ్చింది.గీతా ఆర్ట్స్ బ్యానర్లో చిరుతో సినిమా చేయమని నిర్మాత అల్లు అరవింద్ అడిగారు.మరోవైపు దర్శకరత్న దాసరి తాను నిర్మాతగా పవన్ కథానాయకుడిగా సినిమా చేయమని కోరారు.ఈ సందిగ్ధ పరిస్థితుల్లో అయన చిరు సినిమా వైపే మొగ్గినట్టు సమాచారం.ఆ సినిమా కోసం బోయపాటి స్వయంగా కథ,మాటలు రాసే పనిలో పడ్డారంట.

పవన్ సినిమా కాదనుకోడానికి బోయపాటికి వున్న అభ్యంతరాలు ఏమిటని ఆరా తీస్తే అయన సన్నిహితుల నుంచి కొన్ని ఆలోచనలు వ్యక్తమయ్యాయి.పవన్ తో సినిమా అంటే ఎక్కువ టైం పడుతుందని..ఇక దాసరి కూడా కలిస్తే ..మార్పులు చేర్పులకే సమయం సరిపోతుందని బోయపాటి శ్రేయోభిలాషులు ఆయన్ని హెచ్చరించారట.అన్నిటికన్నా ముఖ్యంగా దాసరి టీం ఇప్పటికే టైటిల్,కథ వండేశారు .కానీ ఇప్పుడు ఎదురైన విమర్శలకు సమాధానంగా బోయపాటి సొంతంగా కథ,మాటలు రాయాలనుకుంటున్నారట.ఆ పరిస్థితుల్లో చిరు వైపే బోయపాటి మొగ్గారన్నమాట.