బోయపాటి ప్లాన్ అదుర్స్

Posted November 15, 2016

Boyapati Surprise Plan For His Next Movieటాలీవుడ్ కమర్షియల్ మాస్ డైరక్టర్స్ లో బోయపాటి ఒకరు.. అభిమానులు తమ హీరోని ఏ రేంజ్లో ఊహిస్తారో దానికి ఏమాత్రం తగ్గకుండా చూపిస్తాడు. అయితే వరుస హిట్స్ తో మంచి జోష్ లో ఉన్న బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. అల్లుడు శీను, స్పీడున్నోడు సినిమాలతో వచ్చిన శ్రీను రెండు సినిమాలకు ఒకే ఫలితాన్ని అందుకున్నాడు.

అయితే కుర్రాడికి హిట్ ఇచ్చేందుకు ఈ సినిమాలో క్రేజీ స్టార్స్ ను తీసుకుంటున్నాడట బోయపాటి. తెలుస్తున్న సమాచారం ప్రకారం శ్రీకాంత్, రాజశేఖర్ ఇద్దరిలో ఒకరు ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అంతేకాదు తమిళ నటుడు శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో ఉంటారట. సో అలా కుర్ర హీరో సినిమాకు కమర్షియల్ లుక్ తెచ్చేందుకు భారీ మల్టీస్టారర్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడట.

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తనయుడిని స్టార్ గా చేసే ప్రయత్నంలో బెల్లంకొండ సురేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.