నా నుండి ఎవరు తప్పించుకోలేరు..!

Posted November 12, 2016

bbr1టాలీవుడ్ నవ్వుల రారాజు బ్రహ్మానందం ఇప్పుడు ఫాంలో లేడు కాని అతను ఫాంలో లేకున్నా ఆయన ఫ్యాన్స్ మాత్రం తనను అడ్డం పెట్టుకుని నవ్విస్తూనే ఉన్నారు. విషయం ఏదైనా వ్యక్తులు ఎవరైనా సరే కాస్త సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది అంటే చాలు వారి మీద బ్రహ్మి అస్త్రం అదేనండి బ్రహ్మి ఫ్యాన్స్ కన్ను పడ్డట్టే. ఇంకేముంది వారి ఫోటోని బ్రహ్మానందం ఫోటోతో మార్ఫింగ్ చేస్తారు.

అబ్దుల్ కలాం నుండి లాలూ ప్రసాద్ యాదవ్ వరకు ఇలా బ్రహ్మి బారిన పడిన వారే. తాజాగా బ్రహ్మి కన్నుల్లో పడ్డాడు డొనాల్డ్ ట్రంప్. నా నుండి ఎవరు తప్పించుకోలేరు అంటూ డొనాల్డ్ ట్రంప్ ను కాస్త డొనాల్డ్ బ్రంప్ ను చేసేశారు. బ్రహ్మి ట్రంప్ మాఫింగ్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సినిమాల్లో క్రేజ్ తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం బ్రహ్మి అంటే పడి నవ్వాల్సిందే. ఈ సరికొత్త సంచలనం నెటిజెన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది.