బ్రహ్మానందంతో త్రివిక్రమ్ సినిమా !

 Posted October 24, 2016

brahmanandam hero in trivikram movieకామెడీ బ్రహ్మా బ్రహ్మానందం హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కథని రెడీ చేసుకొన్న బ్రహ్మీ.. స్వీయ దర్శకత్వంలో సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు. హీరోయిన్స్ గా హాట్ యాంకర్స్ అనసూయ, రష్మీలని సెలక్ట్ చేసుకొన్నాడు. ఇప్పుడీ ప్రాజెక్ట్ లోకి త్రివిక్రమ్ ఎంటర్ అయినట్టు సమాచారమ్.

బ్రహ్మీని హీరోగా మాత్రమే చేసి… దర్శకత్వ బాధ్యతలని వేరే వారికి అప్పగించాలని సూచించాడట త్రివిక్రమ్. అంతేకాదు…. ఈ సినిమాని త్రివిక్రమ్  నిర్మించబోతున్నాడు. బ్రహ్మా సినిమాకి త్రివిక్రమ్ కూడా యాడ్ కావడంతో ఈ సినిమాపై క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.ఇప్పుడీ ఈ చిత్రం బ్రహ్మానందం-త్రివిక్రమ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే నందినిరెడ్డి చిత్రాన్ని నిర్మించేందుకు త్రివిక్రమ్ రెడీ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రహ్మానందం చిత్రం కూడా ఓకే అయ్యింది. దీంతో.. వచ్చే యేడాది త్రివిక్రమ్ నిర్మించే రెండు, మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే, ఈ మధ్య క్రేజ్ అంతా పడిపోయి.. అవకాశాల్లేని బ్రహ్మీని త్రివిక్రమ్ హీరోగా ఏ మేరకు నిలబెడతాననేది చూడాలి.