బ్రాహ్మణి,భారతి 2019 లో ఢీకొట్టబోతున్నారా?

0
49

Posted April 22, 2017 at 16:57

brahmani vs bharathi
ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల వేడి రగులుకుంటోంది.ఆ వేడిని జ్వాలగా మార్చే శక్తి వున్న విషయం ఒకటి బయటికి వస్తోంది.అదే …రాష్ట్రంలో అధికారం కోసం కొట్లాడుతున్న రెండు కుటుంబాలకు చెందిన మహిళలు 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగానో,పరోక్షం గానో తలపడబోతున్నారు. రాజకీయ వైరాన్ని వ్యక్తిగత పోరుగా మార్చుకున్న నారా,వై.ఎస్ కుటుంబాల కోడళ్ళు ఇప్పటి నుంచే ఆ ఎన్నికల యుద్ధానికి సిద్ధం అవుతున్నారు.

నందమూరి ఆడపడుచుగా,నారా వారి కోడలుగా ఇప్పటికే టీడీపీ సర్వే వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్న బ్రాహ్మణి ని వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారట.స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టిన కృష్ణా జిల్లాలోని విజయవాడ లోక్ సభకు ఆమెని పోటీ చేయించాలని సీరియస్ ఆలోచన సాగుతోంది.ఆ ఆలోచనని దృష్టిలో ఉంచుకునే మంత్రులకు,లోక్ సభ నియోజక వర్గాల బాధ్యత అప్పగిస్తున్నారట.లోకేష్ కి విజయవాడ బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సమాచారం.అంటే ఓ విధంగా బ్రాహ్మణి గెలుపు భారాన్ని లోకేష్ మీద పెట్టబోతున్నారు చంద్రబాబు.ఎక్కడ నుంచి పోటీ చేసినా బ్రాహ్మణి తో కీలక నియోజక వర్గాల్లో ప్రచారం చేయించే ఆలోచన కూడా ఉందంటున్నారు.

ఇక వై.ఎస్ కోడలు,జగన్ సతీమణి భారతి కూడా వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు మెండుగా వున్నాయట.జగన్ కి కేసుల వల్ల ఏ ఇబ్బంది వచ్చినా,లేకున్నా ఆయన భారాన్ని మోయడానికి భారతి సిద్ధంగా ఉన్నారట.చెల్లి షర్మిల,తల్లి విజయమ్మలకి కాకుండా ఈసారి పార్టీ పనులని భారతికి అప్పగించడానికి జగన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.వీలైతే కడప లోక్ సభ నుంచి భారతిని పోటీ చేయించాలని కూడా జగన్ ఆలోసిగిస్తున్నారట.కడప జిల్లాలో తగ్గుతున్న బలాన్ని పెంచుకోడానికి ఈ వ్యూహం పనికొస్తుందని జగన్ నమ్ముతున్నారట.జగన్ జైలుకి వెళితే భారతి రాష్ట్రవ్యాప్త ప్రచారానికి కూడా కదిలే అవకాశం వుంది.మొత్తానికి నారా,వై.ఎస్ ఇంటి కోడళ్ళు ఎన్నికలబరిలోకి దిగితే ఏపీ ఎలక్షన్ హీట్ పీక్స్ కి వెళ్లడం ఖాయం.