హైదరాబాద్ లో భవనం కూలి పలువురు మృతి ..

Posted December 9, 2016

Building collapse in Nanak Ram Guda At Hyderabadహైదరాబాద్ లోని నానక్‌రాంగూడ లోథా బస్తీ ఏడంతస్తుల భవనం నిట్టనిలువునా కుప్పకూలింది! భవనం సెల్లార్లో ఉంటున్న ఎనిమిది కుటుంబాల్లోని దాదాపు 20 మంది ఆ శిథిలాల్లో చిక్కుకుపోయారు.ఈ ప్రమాదం లో విశాఖ జిల్లాకు చెందిన భవన నిర్మాణ కార్మికులు చిక్కుకున్నారు. శిథిలాలు పక్కనే ఉన్న మరో బిల్డింగ్‌పై పడటంతో అది కూడా పాక్షికంగా ధ్వంసమైంది.స్థానికుల సమాచారం ప్రకారం.. లోథా బస్తీలో సత్యనారాయణ సింగ్‌ అలియాస్‌ సత్తు సింగ్‌ ఏడాది క్రితం 266 గజాల భూమిలో నిర్మాణం చేపట్టాడు.

ఐతే ఈ నిర్మాణం అనుమతులు లేకుండా జీ + 6 గా నిర్మిస్తున్నాడని, నిర్మాణం నాసిరకంగా ఉందంటూ స్థానికులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అంత పెద్ద స్థలానికి 16 పిల్లర్లు నిర్మించినా,  పుట్టింగ్‌లు సరిగా లేవని అనేక సందర్భాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా వాళ్లు పట్టించుకోలేదు. అధికార పార్టీకి చెందిన ఓ మంత్రికి సత్యనారాయణసింగ్‌ స్నేహితుడు కావడమే ఇందుకు కారణమని స్థానికులు అంటున్నారు

సత్యనారాయణ సింగ్‌కు చెందిన భవనం కూలిన ఘటనలో పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం. నాణ్యత లోపం కారణమా లేక ఇతర కారణాలు ఎమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తాం. అక్రమ నిర్మాణం అయి ఉంటుందని భావిస్తున్నాం. రికార్డులు పరిశీలిస్తున్నాం. కాంట్రాక్టర్‌, నిర్మాణ దారుడు పై చర్యలు తీసుకుంటాం. అని జి హెచ్ ఎమ్ సి వాళ్ళు అంటున్నారు ..