బులెట్ ట్రైన్ డ్రైవర్ మోడీ…

Posted November 12, 2016

bullet train driver modiజపాన్‌ పర్యటనలో వున్నా మన ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఒప్పందాలు చేసుకోవటం తో పాటు అక్కడ బులెట్ ట్రైన్ ను కూడా ఒక సారి నడిపి చూసారు. జపాన్‌ పారిశ్రామిక రంగంలో భారత్‌ కీలక భాగస్వామ్యం కోరుకుంటోందని, దీనివల్ల ఇరు దేశాలకు లాభమే అట శనివారం కొబెలో మోదీ జపాన్‌ వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. 2007, 2012లో ఇక్కడ పర‍్యటించానని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు.

జపాన్‌ ప్రధాని షింజో అబెతో కలిసి మోదీ టోక్యో నుంచి కొబెకు హై స్పీడ్‌ రైల్లో ప్రయాణించారు. రైల్లో మోదీ, అబె ఇద్దరూ కలసి డ్రైవర్‌ క్యాబిన్‌లోకి వెళ్లారు. మోదీ కాసేపు డ్రైవర్‌ సీట్లో కూర్చుని ఆపరేట్‌ చేశారు. కొబెలో ప్రధాని మోదీ వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులతో భేటీ అయ్యారు. మోదీ, అబె సమక్షంలో గుజరాత్‌, హ్యోగో ప్రభుత్వాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.