ఆమ్మో.. నెలల బిడ్డపై ఆయా క్రూరత్వం

Posted November 25, 2016

caretaker herassment on months babyనిండా ఏడాదైనా నిండని ఓ పసి ప్రాణాన్ని చూస్తే ఎవరికైనా ముద్దొస్తుంది..కానీ ఆయా ముసుగులో ఉన్న ఓ రాక్షసి మాత్రం ఆ నెలల బిడ్డపై క్రూరత్వాన్ని ప్రదర్శించి మానవత్వానికే మచ్చ తెచ్చింది.నిద్రపోవడం లేదని పసి బిడ్డని దారుణం గా కొట్టి హింసించింది.ముంబైలోని పూర్వ ప్లే స్కూల్ లో ఈ ఘటన జరిగింది.ఉద్యోగులైన తల్లి దండ్రులు పదినెలల చిన్నారిని ప్లే స్కూల్ లో వదిలిపెట్టారు.సాయంత్రం బిడ్డ వంటి మీద గాయాలు చూసి ఆమె యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే వాళ్ళు సీసీ టీవీ పరిశీలించారు.అందులో ఆఫ్సానా అనే ఆయా క్రూరత్వం కళ్ళకి కట్టింది.వెంటనే వాళ్ళు పోలీసులకి ఫిర్యాదు చేశారు.ఆ ఆయాని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.చిన్నారిపై ఆయా దారుణానికి సాక్షాలుగా నిలిచినా సీసీ టీవీ దృశ్యాలివే ….