పిల్లే కదా అని గదిలో పెడితే  కోర్ట్ కీడ్చాయే ..!

Posted November 24, 2016

cats

మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్త అని చిరంజీవి ఇంద్ర సినిమా లో డైలాగ్ గుర్తుంది కదా …పిల్లులు కదా అని గదిలో పెట్టి తాళం వేస్తె చివరకి కోర్ట్ మెట్లెక్కాల్సి వచ్చింది .విషయం ఏమిటంటే…. చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన అత్యంత పాశవిక చర్యల్లో ఇదొకటి. 14 పిల్లులను ఒక గదిలో బంధించి చివరకు అవి ఒకదానినొకటి చంపుకొని తినేవరకూ తలుపు తీయకుండా ఓ మహిళ వికృత చర్యకు పాల్పడింది.ఆకలికి తట్టుకోలేక ఆ పిల్లులు చివరికి ఒకదానినొకటి చంపుకొంటూ ఆకలి తీర్చుకున్నాయి.

పోలీసులు ఆ ఇంటికి చేరుకుని గది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. ‘గదిలోపల భయానక పరిస్థితి ఉంది. 14 పిల్లుల్లో ఒకే ఒక పిల్లి బతికి, అదీ బక్కచిక్కిపోయి ఉంది.
పిల్లుల మరణానికి కారణం అనే నేరానికి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరిచారు , జంతువులను పెంచుకోనన్న డిక్లరేషన్‌తో పాటు 12నెలల సత్పప్రవర్తన బాండ్‌ను కూడా కోర్టు ఆమెనుంచి తీసుకుంది.ఆమె రెండు వారాలు కస్టడీలో ఉన్న విషయం, ప్రస్తుతం ఆమె మానసిక ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈ శిక్షతో సరిపెట్టింది న్యాయస్థానం. పెంపుడు జంతువులను పెంచుకునేవారెవరైనా సరే ఏ కారణంగానైనా వాటిని జాగ్రత్తగా చూడలేమనుకున్నప్పుడు జంతువుల సంరక్షణాలయానికి అప్పగించాలని సూచించింది .