అవినీతి పై సీబీఐ ఏకాస్త్రం….

Posted November 17, 2016

cbi plan to single number corruption complaint in all over indiaఅవినీతి పై ఫిర్యాదులు చేసేందుకు ప్రజలకు అందుబాటులో ఒకే నెంబర్ ను అందుబాటులోకి తీసుకురావాలని సిబిఐ యోచిస్తున్నట్టు సమాచారం . ఫిర్యాదును స్వీకరించిన అనంతరం అది కేంద్ర పరిధిలోకి వచ్చే సంస్థల్లో అవినీతికి సంబంధించినది అయితే సీబీఐ సొంతంగా విచారణ చేపడుతుంది. రాష్ట్ర విభాగాలకు చెందిన ఫిర్యాదు అయితే సంబంధిత రాష్ట్రంలోని అవినీతి నిరోధక విభాగాలకు చేరవేస్తుంది.అనంతరం వాటి పురోగతినీ తెలుసుకుంటూ ఉంటుంది. కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా ఈ–మెయిళ్లు, సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా ఇందులో స్వీకరిస్తారట .