దాసరి ఈజ్‌ బ్యాక్‌.. అంతా హ్యాపీ

0
74

 Posted May 5, 2017 at 13:10

celebrities are attend dasari narayana rao birthday after discharge hospital
టాలీవుడ్‌కు పెద్ద దిక్కు అయిన దాసరి నారాయణ రావు మూడు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంకు గురైన విషయం తెల్సిందే. ఆయన అనారోగ్యంపై తీవ్ర స్థాయిలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటం జరిగింది. ఒకానొక దశలో దాసరి మృతి చెందాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే దాసరి పూర్తి ఆరోగ్యంతో ఇటీవలే హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ అయ్యారు. దాదాపు మూడు నెలల పాటు హాస్పిటల్‌లో ఉండి పోయిన దాసరి నారాయణ రావు ప్రస్తుతం పూర్తి స్థాయి ఆరోగ్యంగా ఉన్నట్లుగా ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తాజాగా దాసరి మళ్లీ సినీ వేడుకలతో బిజీ అయ్యాడు.

చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా దాసరిని అనుకుంటూ ఉంటారు. చిన్న సినిమాల ప్రమోషన్‌ కార్యక్రమాలకు అంటే ఆడియో ఫంక్షన్‌, టీజర్‌ విడుదల, టైలర్‌ విడుదల వంటి వాటికి దాసరి తప్పకుండా హాజరు అవుతారు. అందుకే ఆయన్ను చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా చెబుతుంటారు. అలాంటి దాసరి అనారోగ్య కారణంగా మంచాన పడటంతో చిన్న నిర్మాతలు తీవ్ర స్థాయిలో ఆందోళనకు  గురి అయ్యారు. తాజాగా దాసరి పూర్తి ఆరోగ్యంగా రావడంతో అంతా సంతోషిస్తున్నారు. దాసరి నారాయణ రావు మళ్లీ మునుపటిలా చిన్న సినిమాల కార్యక్రమాల్లో రెగ్యుర్‌గా పాల్గొంటాడేమో చూడాలి. తాజాగా పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న దాసరి చాలా బక్కగా అయినట్లుగా కనిపిస్తున్నాడు.