ఈ దారుణం ఏ రాజ్యానికి సంకేతం..?

0
112

Posted April 26, 2017 at 11:37

central govt new strategy on maoist after chhattisgarh crpf jawans deadమాట్లాడితే సమ సమాజ స్థాపన అంటూ గొంతు చించుకునే మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ దోర్నాల ఎన్ కౌంటర్ కు జవాబు చెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది. మావోయిస్టుల్ని జవాన్లు కాల్చి చంపినప్పుడు వెంనటే స్పందించి పౌర హక్కుల సంఘాలు.. ఇప్పుడు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతదేహాల్ని మావోయిస్టులు ఛిద్రం చేసినా పట్టించుకోలేదు. దీన్ని బట్టి వారి దృష్టిలో న్యాయం ఓవైపే ఉంటోందని అర్థమైపోతోంది.

భౌగోళికంగా క్లిష్టపరిస్థితుల్ని సృష్టించి, ఒక్కసారిపై జవాన్లపై దాడికి దిగిన మావోయిస్టులు.. సరిగ్గా భోజనం చేస్తున్నప్పుడు దాడి చేశారు. ఎన్ కౌంటర్ పాతిక నిమిషాలే జరిగినా.. దాదాపు మూడున్నర గంటల పాటు అక్కడే ఉండి, చేతికి దొరికిన ఆయుధాలు ఎత్తుకెళ్లారు. పైగా తమకు రక్షణగా స్థానికంగా ఉండే స్త్రీలు, చిన్నపిల్లల్ని వాడుకున్నారు. దీంతో మావోయిస్టుల్ని తక్కువ అంచనా వేయకూడదన్న గుణపాఠం మరోసారి జవాన్లు నేర్చుకోవాల్సి వచ్చింది.

సీఆర్పీఎఫ్ ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్డు భద్రత కోసం వెళ్లిన జవాన్లు బృందాలుగా విడిపోవడం, చుట్టూ కొండలున్నా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇంత ఘోరం జరిగిందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. పదేపదే వ్యూహాత్మక వైఫల్యాలు చేస్తూ.. మావోయిస్టులకు జవాన్లు టార్గెట్ అవుతున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది. కేంద్రం ఇప్పటికైనా మావోయిస్టులపై యుద్ధం విషయంలో కొత్త వ్యూహాలు అనుసరించాలని సూచనలు వస్తున్నాయి.