విమాన ప్రయాణం మరింత భారం …

Posted November 11, 2016

central govt udan scheme for regional air connectivity

విమానాల లో ప్రయాణం ఇంకొంచెం భారంగా మారింది.ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా వంటి రూట్లలో విమాన చార్జీలు మరింత పెరుగుతాయి ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీని పెంచేందుకు ఉద్దేశించిన నిధి కోసం లెవీ విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. దూరాన్ని బట్టి ప్రయాణాలపై లెవీ ఉంటుంది.కేంద్ర ప్రభుత్వం జనవరిలో ప్రారంభించనున్న యూడీఎన్ (ఉడె దేశ్ కా ఆమ్ నాగ్రిక్) పథకాన్ని . చిన్న సిటీలకు కనెక్టివిటీ పెంచుతూ సామాన్య ప్రజలకు కూడా విమాన సేవలు అందించేందుకు కేంద్రం ఈ పథకాన్ని ఉద్దేశించింది.

central govt increase flight tickets chargesప్రయాణించే దూరాన్ని బట్టి లెవీ ఉంటుందని పౌర విమానాయాన కార్యదర్శి ఆర్.చౌబే తెలిపారు. ఆ ప్రకారం 1000 కిలోమీటర్ల లోపు దూరం వెళ్లే విమానాలకు రూ.7,500, 1000 నుంచి 1500 కిలోమీటర్ల వరకు దూరం వెళ్లే విమానాలకు రూ.8000 లెవీ విధించ‌నున్నారు. 1500 కిలోమీటర్లకు మించి దూరం వెళ్లే విమానాలకు రూ.8,500 చొప్పున లెవీ ఉంటుంది. ఈ టారిఫ్ ద్వారా ఏటా రూ.400 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా. ఉడాన్ కోసం ప్రభుత్వం రీజినల్ కెనెక్టివిటీ ఫండ్‌ను ఏర్పాటు చేయనుందని, దీనికి అదనంగా రాష్ట్రప్రభుత్వాల ఫండిగ్ 20 శాతం ఉంటుంది