వామ్మో.. చైతూ కొత్త బైక్ ధర ఎంతో తెలుసా..?

Posted January 25, 2017

chaitu new bike cost 27 lacks
మార్కెట్లో ఎన్ని కొత్త కార్లు ఉన్నా యువత మాత్రం బైక్ నే ఇష్టపడుతుంది. ఆ బైక్ మీద రై రై మంటూ చక్కర్లు కొడుతుంటే వారికి వచ్చే మజానే వేరుగా ఉంటుంది. ఇందుకు టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా మినహాయింపు కాదు. వారి దగ్గర ఇంపోర్టెడ్ కార్లు ఉన్నా వారు మాత్రం బైక్ నడపడానికే ఇష్టపడుతుంటారు. అందుకే మార్కెట్లోకి ఏ కొత్త బైక్ వచ్చినా, ఎంత ధర ఉన్నా కొంతమంది హీరోలు కొని షైర్ కెళుతుంటారు.

తాజాగా బైక్ లవర్ నాగచైతన్య సూపర్ బైక్ కేటగిరీలోని ఎంవీ అగస్టాను సొంతం చేసుకున్నాడు. అయితే దీని ధర వింటే మాత్రం కాస్త షాక్ అవ్వక తప్పదు. చైతూ ఎంతో మోజు పడి కొనుకున్న బైక్ ధర జస్ట్ 27లక్షలు. ఈ బైక్ రిజిస్ట్రేషన్ కోసం.. చైతూ చెల్లించిన లైఫ్ టైం రోడ్ ట్యాక్స్ 4.5లక్షలు. ఈ బైక్ కి టీఎస్ 07 ఎఫ్ఎం 2003 నెంబర్ ను కేటాయించినట్లు కొండాపూర్ ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి ఖరీదైన బైక్స్ కు ఫ్యాన్సీ నెంబర్ కోసం ప్రయత్నిస్తారని, కానీ.. చైతు మాత్రం సాధారణ నెంబర్ తోనే సరిపెట్టుకున్నాడని అంటున్నారు.