ఆమె సంపాదిస్తుంటే మీరు?…లోకేష్ కి షాకింగ్ క్వశ్చన్

Posted November 11, 2016

chalapathi engineering college student asked shocking question to nara lokesh
ఈకాలం పిల్లలు ఎప్పుడు ఎవరికి ఎలా షాక్ ఇస్తారో చెప్పలేం. గుంటూరు చలపతి విద్యార్థులతో సమావేశమైన లోకేష్ కి ఓ విద్యార్థి నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది.మీ అమ్మ, భార్య వ్యాపారం చేసి సంపాదిస్తుంటే మీరు ఖర్చుపెట్టుకుంటున్నారుగా అని ఓ విద్యార్థి అడగడంతో లోకేష్ షాక్ అయ్యాడు.అంతలోనే తేరుకొని మా నాన్న ఖర్చులకి,నా ఖర్చులకి అమ్మే డబ్బులిస్తుంది …అందుకే మేము అవినీతి లేకుండా రాజకీయాలు చేస్తున్నామని లోకేష్ బదులిచ్చారు.
దీంతో పాటు రాష్ట్రానికి సంబందించిన కీలక అంశాలపై లోకేష్ విద్యార్థులతో మనసు విప్పి మాట్లాడారు.జీఎస్టీ వచ్చాక ప్రత్యేక హోదా తో పన్ను రాయితీల వల్ల అదనపు ప్రయోజనం ఉండదు కాబట్టే ప్యాకేజ్ కి అంగీకరించినట్టు లోకేష్ చెప్పారు.ప్రతిపక్షాలు కోరినట్టు కేంద్రం నుంచి బయటకు రావడం రెండు నిమిషాల పని …ఆ తర్వాత కేంద్రంతో రాష్ట్ర నిధుల గురించి అడిగే అవకాశం కూడా పోతుందిఅని లోకేష్ అభిప్రాయపడ్డారు.కాళ్ళు,చేతులు పట్టుకోనైనా రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు తెస్తామన్నారు. 2000 నోట్లతో కొత్త సమస్య వచ్చే అవకాశం ఉందన్నారు.కుల,మత,ప్రాంతాలకి అతీతంగా అందరం ఆంధ్రులమనే భావనతో ముందుకెళ్లాలని లోకేష్ విద్యార్ధులకి పిలుపునిచ్చారు.