సొంత జిల్లా తమ్ముళ్లకు చంద్రబాబు క్లాస్

0
38

Posted April 27, 2017 at 10:10

chandrababu class to chittoor district tdp leadersఇసుక కుంభకోణం సహించేది లేదు. ఎవరు అక్రమ తవ్వకాలు చేసినా శిక్ష తప్పదు. ఇదీ చిత్తూరు జిల్లా సమీక్షా సమావేశంలో తమ్ముళ్లకు చంద్రబాబు చేసిన హెచ్చరిక. ఏపీలో కొంతకాలంగా ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోయాయి. పైగా టీడీపీ నేతలే దందా చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అలర్టైన చంద్రబాబు నేతలకు క్లాస్ పీకి, ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చారు. అయినా అక్రమాలు ఆగడం లేదు. దీంతో మరోసారి సీరియస్ అయిన బాబు ఏకంగా ఇసుక కుంభకోణం మీదే సమీక్ష చేసి తమ్ముళ్లను ఉతికేశారు.

అసలు క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీ పార్టీలో ఇలాంటివి కుదరవని తేల్చిచెప్పేశారు. సీనియర్లు, జూనియర్లనే తేడాలేవీ తనకు లేవని, ఎవరు తప్పు చేసినా కఠినంగా శిక్షిస్తానని చెప్పేశారు బాబు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుండా.. ఈ చిల్లర పంచాయితీలేంటని మండిపడ్డారు. క్యాబినెట్ విస్తరణ సమయంలో పదవులు రాలేదని అలిగిన వారికి కూడా గట్టిగా క్లాస్ పీకారు. పార్టీ అవసరాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా పదవులు వస్తాయని గ్రహించాలని గుర్తుచేశారు.

చిత్తూరు జిల్లాలో టీడీపీ గ్రూపు తగాదాలపై కూడా సీరియస్ అయ్యారు బాబు. ఓవైపు జగన్ సొంత జిల్లా కడపపై దృష్టి పెడుతుంటే.. నా సొంత జిల్లాలో పార్టీ నేతలు కొట్టుకుంటే ఎలాగని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అన్న కట్టిపెట్టి గెలుపు వ్యూహాలు రచించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా చిత్తూరులో క్లీన్ స్వీప్ చేయాలని సూచించారు. గత ఎన్నికల్లో మాదిరిగా పనిచేస్తే ఈసారి సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. తాను కష్టపడుతున్నా నేతలు మాత్రం ఎప్పటిలాగే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు.