రోజుకి రెండుగంటలు దానికోసం కానీ ..ఫలితం లేదు ..చంద్రబాబు

Posted December 21, 2016

chandrababu daily 2 hours work but no resultహలో …అంత లేదు జస్ట్ టైటిల్ బావుండాలని ఆలా పెట్టాం ఎక్కువ ఊహించుకోవద్దు..విషయం ఏమిటంటే 13 మంది సభ్యులతో కూడిన కాష్ లెస్ ఎకానమీ కమిటీ కి కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు విజయవాడ లో తెలుగుదేశం వర్క్ షాప్ లో అన్న మాటలివి..

విజయవాడలో తెలుగుదేశం పార్టీ వర్క్ షాప్ జరుగుతోంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో నిన్న జరిగిన వర్క్‌షాప్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు అలా జరిగిపోయిందని అన్నారు నోట్ల రద్దు ని ప్రకటించి 40రోజులు గడచిందని ఐనా బోలెడు ప్రశ్నలకి సమాధానం దొరకాల్సి ఉందని అన్నారు.పెద్ద నోట్ల రద్దు అంశం చాలా సున్నితమైన అంశం అని రోజుకు 2గంటల పాటు తాను ఈ విషయంపై ఆలోచిస్తున్నానని చెప్పారు.రద్దు వల్ల వచ్చిన సమస్యల్ని ఎలా సాల్వ్ చెయ్యాలా అని రోజుకు రెండుగంటలు ఆలోచిస్తున్నా అని ఐనా సమాధానం దొరకడం లేదని చంద్రబాబు ఈ వర్క్ షాప్ లో వ్యాఖ్యానించారు. డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించాలంటే ఇంకా కొంచెం సేపు ఆలోచించాలేమో ..!