చంద్రబాబు స్కీములా.. మజాకా..!

0
64

 Posted April 30, 2017 at 11:19

chandrababu excellent schemesదేశవ్యాప్తంగా నగదు బదిలీ విధానంపై విమర్శలు వచ్చినప్పుడు అందరి కంటే ముందే దాన్ని ఆహ్వానించింది చంద్రబాబే. అప్పుడు బాబును చూసిన నవ్వినవాళ్లే తర్వాత నాలిక్కరుచుకున్నారు. ఇప్పుడు కూడా సంక్షేమ పథకాల్లో అదే పద్ధితిలో ముందుకెళ్తున్నారు. అందరూ రేషన్ ఇస్తారు. కానీ చంద్రబాబు మాత్రం ఇప్పటికే రేషన్ కార్డు దారులు జిల్లాలో ఎక్కడన్నా రేషన్ తీసుకోవచ్చని ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు మరో సరికొత్త ఆలోచన చేస్తున్నారు. రేషన్ బియ్యం వద్దు అనుకునే వాళ్లకు కావాలంటే ఖాతాల్లో డబ్బులు వేయడానికి సిద్ధమే అన్నారు చంద్రబాబు.

ఇక నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి.. అందర్నీ ఆశ్చర్యపరిచిన చంద్రబాబు.. ఇప్పుడు అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. తప్పకుండా నిరుద్యోగ భృతి హామీ నిలబెట్టుకుంటామని, విధివిధానాలు ఖరారు చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. ధనిక రాష్ట్రాలుగా చెప్పుకునే చాలా చోట్ల కూడా పథకాలు అంత పర్ఫెక్ట్ గా అమలు కావడం లేదు. అలాంటిది రెవిన్యూలోటుతో సతమతమౌతున్న ఏపీలో మాత్రం చంద్రబాబు సరికొత్త స్కీములు ప్రవేశపెట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది.

ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ మంత్రంతో భూసేకరణ బాథలకు చెక్ పెట్టి.. అందరికీ ఆదర్శంగా నిలిచారు చంద్రబాబు. ఇక రేషన్ బియ్యం బదులుగా నగదు ఖాతాల్లో వేస్తామంటే చాలా మంది దానికే మొగ్గుచూపే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. దీంతో అటు బియ్యం సేవ్ చేసుకోవచ్చు. కాస్త డబ్బులతో స్కీమ్ కంప్లీట్ చేయొచ్చనే వాదన కూడా ఉంది. ఇక నిరుద్యోగ భృతి అనేది కేవలం ప్రపంచంలోని ధనిక దేశాల్లో మాత్రమే ఉంది. ఏపీలో విజయవంతంగా అమలైతే.. ఎన్నికల ముందు తాము కూడా ఈ స్కీమ్ తేవాలని కేంద్రం భావిస్తోంది. దటీజ్ చంద్రబాబు.