Ap కలెక్టర్ల కాన్ఫరెన్స్… బుల్లెట్ పాయింట్స్..

Posted September 28, 2016

 chandrababu home ap collectors conference

రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం మొదటి రోజు నాలుగు సెషన్లు, రెండో రోజు ఐదు సెషన్లు మెట్రో రైలు ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో సమీక్ష, సమీక్షకు హాజరైన మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ, మెట్రో ఎండీ రామకృష్ణా రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి కరికాల వలన్

 • మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు, భూసమీకరణపై చర్చ కోర్ డాష్ బోర్డ్, కమాండ్ కంట్రోల్ సిస్టం వంటి వినూత్న పద్ధతులతో పరిపాలనలో సరికొత్త మార్పులు తీసుకొచ్చాము. ఉప ముఖ్యమంత్రి.
 • పారిశ్రామిక అభివృద్ధిలో ప్రగతి వైపు పయనిస్తున్నాం. ఆర్ధిక మంత్రి యనమల.
 • అనేక రంగాల్లో మిగతా రాష్ట్రాల కన్నా ముందున్నాం. యనమల.
 • ఆర్ధిక ఫలితాల్లో ఏ పీ ముందు వరుసలో ఉంది. వృద్ది రేటులో వ్యవసాయ రంగం కీలక భూమిక పోషిస్తుంది. యనమల
 • విభజన తర్వాత మనం చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నాం. ముఖ్యమంత్రి.
 • కేవలం మన కష్టం, శ్రమతో సవాళ్ళను సమర్ధంగా ఎర్కొంటున్నాం. సీఎం
 • ఈ ఏడాది త్రైమాసిక ఫలితాలు సమీక్షించుకుంటూ వృద్ది సాధనలో ముందడుగు వేస్తున్నాం.సీఎం
 • వివిధ స్థాయిల్లో అధికారుల పనితీరు మెరుగు పరుస్తున్నాం. సీఎం
 • మొదటి త్రైమాసికంలో 12.26 శాతం వృద్ది రేటు సాధించాం. ఇది ఇండియా వృద్ది రేటు 7.31 శాతం కన్నా ఎక్కువ. సీఎం
 • జల భద్రత ఉంటేనే అభివృద్ది సాధ్యమౌతుంది. సీఎం
 • మొదట భూగర్భ జల వనరులను కాపాడుకుంటున్నాం, రెండో ప్రయత్నంగా నదుల అనుసంధానం చేస్తున్నాం. స్మార్ట్ వాటర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమంగా జల వనరులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సీఎం.
 • ఎక్కడికక్కడ స్థానికంగా స్మాల్ గ్రిడ్లతో స్మార్ట్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నాం. సీఎం
 • ఈ ఏడాది ఫలితాలు బాగా వచ్చాయి. 9.7 అడుగులకు భూగర్భ జలాలు రావడం సంతృప్తికరం.సీఎం
 • ఎప్పుడు కరువు ఉండే రాయలసీమను ఆదుకున్నాం. మెట్ట పైర్లు దెబ్బతినే పరిస్థితిలో తక్షణం రైన్ గన్ ద్వారా రక్షక తడులు అందించాం.సీఎం
 • 6 రోజుల్లో 4 లక్షల ఎకరాలకు తడులు అందించాం. కరువుఫై యుద్ధంలో పాల్గొన్న యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. సీఎం
 • పట్టి సీమ ద్వారా కృష్ణా డెల్టాకి సాగునీరుకు నిశ్చింత. సీఎం
 • పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి నాబార్డు అంగీకరించింది పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత లేదు. ఇప్పుడు కావాల్సింది నిర్ణీత సమయలోగా పనులు పూర్తీ చేసేందుకు కార్యాచరణ చెప్పట్టడమే. సీఎం
 • వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితేనే ఆశించిన వృద్ది సాధన సాధ్యపడుతుంది. సీఎం
 • ప్రపంచానికే సముద్ర ఆహారోత్పత్తులలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుంది.సీఎం
 • ఆక్వా కల్చర్ లో ఊహించని వృద్ది రేటు వస్తుంది. సీఎం.
 • సంక్షేమ ఫలాలు సామాన్యుడికి చేర్చడంలో నూరు శాతం సంతృప్తి సాధించాలి. సీఎం
 • ఆహార భద్రతలో భాగంగా ప్రతి పేదవాడి బియ్యం అందిస్తున్నాం. ఇ-పోస్ విధానం అమలు చేస్తున్నా ప్రజా పంపిణీలో ఎక్కడైనా అవకతవకలు జరిగితే వెంటనే వాటిని అరికట్టే బాధ్యత కలక్టర్లదే. సీఎం
 • ప్రతి పేద కుటుంబానికి 10 వేల ఆదాయం అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. సీఎం
 • సమాజంలో ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. అగ్రవర్ణ పేదలకు కూడా స్కాలర్ షిప్స్ ఇస్తున్నాం. సీఎం