పరకాల విషయంలో బాబు అదే పరిస్థితి ఎదుర్కోవాలా ?

Posted November 17, 2016

chandrababu naidu use and through to parakala prabhakarఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి గా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మీడియా సలహాదారుగా పరకాల ప్రభాకర్ ఉన్నారు. ఏ విదేశీ పర్యటనలో అయినా ఆయన ఉండాల్సిందే. ఓటుకు నోటు కేసులో మీడియా ముందు అప్పట్లో పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ఇరకాటంలోకి నెట్టాయి.కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ పౌరసంబంధాల శాఖ కమిషనర్ గా ఎస్. వెంకటేశ్వర్ ను నియమించారు. అప్పటి నుంచి ఆయన నిత్యం చంద్రబాబుకు వెన్నంటి ఉంటున్నారు. దీంతో పరకాలకు పెద్దగా పనిలేకుండా పోయింది.అని టాక్ నడుస్తోంది .

పరకాల ప్రభాకర్ చంద్రబాబు మీద సీరియస్ గా ఉన్నారట . తనను వాడుకున్నంత కాలం వాడుకుని ఇప్పుడు ‘ఆటలో అరటిపండు’ వలే పక్కన పెట్టారని సన్నిహితుల వద్ద గోడు వేళ్ళ బోసుకున్నారట .

అంతేకాకుండా పరకాల ఎక్కువ హైదరాబాద్ లోనే కాలం గడుపుతున్నారట . పరిపాలన అంతా వెలగపూడి కేంద్రంగా సాగుతుంటే..ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర పెద్దగా ఛాన్స్ లేకపోవటంతో ఆయన దూరంగా ఉంటున్నారు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లో కీలకపాత్ర పోషించిన పరకాల ప్రభాకర్ తర్వాత అదే పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రజారాజ్యంపై తీవ్రమైన విమర్శలుచేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పరకాల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరుపై కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని..రాబోయే రోజుల్లో పీఆర్ పీ ఎదుర్కొన్న పరిస్థితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎదురైనా ఆశ్చర్యం లేదని టాక్ ..