పొలిటికల్ పంచ్ నిజమే…

Posted April 21, 2017 at 15:05

chandrababu political punch on social media
సోషల్ మీడియా లో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బాబు సర్కార్ కఠిన వైఖరి తీసుకుంది. పొలిటికల్ పంచ్ పేరిట ఫేస్ బుక్ పేజ్ రన్ చేస్తూ లోకేష్ టార్గెట్ గా కామెంట్స్ పెడుతూ ప్రచారం చేస్తున్న ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తిని తుళ్లూరు పోలీసులు శంషాబాద్ లో అరెస్ట్ చేశారు.ఈ విషయంలో రవికిరణ్ భార్య సుజన ఆందోళన చెందారు.అరెస్ట్ విషయాన్ని మధ్యాహ్నం దాకా పోలీసులు ధృవీకరించకపోవడమే ఆమె ఆందోళనకు కారణమైంది. అయితే రవికిరణ్ ని అరెస్ట్ చేసిన విషయాన్ని గుంటూరు ఎస్పీ నాయక్ ధృవీకరించారు.శాసనమండలి సెక్రటరీ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 67 , 292 కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.

ఈ విషయం తెలియగానే వైసీపీ నేత అంబటి రాంబాబు టీడీపీ సర్కార్ మీద విరుచుకుపడ్డారు.ఇప్పటికే మీడియాని లోబర్చుకున్న చంద్రబాబు,ఇక సోషల్ మీడియాని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.రవికిరణ్ కి అండగా ఉంటామని అంబటి చెప్పారు.మరోవైపు టీడీపీ వర్గాలు మాత్రం అంబటి ఆరోపణల్ని కౌంటర్ చేస్తున్నాయి.సోషల్ మీడియా ముసుగులో వైసీపీ వర్గాలే లోకేష్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వాదిస్తున్నాయి.