బాబు స్నానం చేసిన చోట పర్యాటకం

  chandrababu said hamsala dheevi become tourist placeకృష్ణా జిల్లాలోని హంసలదీవి సాగరసంగమం ఘాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుష్కరస్నానమాచరించారు. అక్కడ పుష్కర ఏర్పాట్లు పరిశీలించారు. ప్రభుత్వం తరపున కృష్ణమ్మకు పట్టవస్త్రాలు సమర్పించారు. సంగమ ప్రాంతాన్ని సందర్శించిన తొలి సీఎం చంద్రబాబునాయుడు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ హంసల దీనికి పర్యాటక కేంద్రంగా మారుస్తామని  అన్నారు.  సాగునీటి, తాగునీటి కొరత తీర్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. కోస్తా తీరం వెంబడి కారిడార్ ను ఏర్పాటు చేస్తామన్నారు.