సంక్రాంతికి ఏపీ లో ప్రతి ఇల్లు ఇంటర్నెట్ కేఫ్…

Posted November 26, 2016

Image result for chandrababu said internet available for all ap people before sankranthi

అవును ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి ఇల్లు సంక్రాతి నుంచి ఇంటర్నెట్ కేఫ్ గా మార బోతోంది..ఈ విషయాన్నీ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడే స్వయంగా వెల్లడించారు .కడపలో జరిగిన బహిరంగ సభలో అయన ఈ విషయాన్నీ చెప్పారు. ఫైబర్ గ్రిడ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని ట్రిపుల్ ప్లే బాక్స్‌‌లు అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు. ఫైబర్ కనెక్టివిటీతో అన్ని ఛానెళ్లు, వీడియో కాన్ఫరెన్స్, ఇంటర్నెట్, మూడు టెలిఫోన్లను ఎంతసేపైనా ఆపరేటింగ్ చేసుకునేందుకు అవకాశం వుంటుందట .

రూ.149 మాత్రమే చెల్లించాల్సి వుంటుందని చంద్రబాబు తెలిపారు. దీని వల్ల అన్ లిమిటెడ్ బ్యాండ్ విత్ తీసుకుని 15 ఎంబీపీఎస్‌‌తో ముందుకు వెళ్లొచ్చన్నారు. మీ ఇళ్లలో ఉండే టీవీ భవిష్యత్తులో అన్నింటికి ఆధారమవుతుందని ఆయన చెప్పారు. ఆన్‌లైన్ షాపింగ్, ఆరోగ్యం బాగలేకపోతే నచ్చిన డాక్టర్‌తో ఇళ్లలోనుంచే మాట్లాడి సలహాలులు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.