చంద్రబాబు నోట తెలుగుబుల్లెట్ మాట…

Posted April 21, 2017 at 15:37

chandrababu says about telugu bullet story words
2018 చివరిలో జమిలి ఎన్నికలంటూ నాలుగు రోజుల కిందట తెలుగుబుల్లెట్ ఇచ్చిన వార్తాకథనాన్ని బలపరుస్తూ ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు.అమరావతిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు ఈ ప్రస్తావన తెచ్చారు.2018 చివర్లో రెండు ఎన్నికలు ఒకే సారి జరగబోతున్నాయని నేతలకు ఆయన స్పష్టం చేశారు.అందుకు తగ్గట్టు పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేయాలని బాబు వారికి సూచించారు.
రెండు వారాల కిందట “మోడీ తానా…బాబు తందానా” అనే కధనంలో ఇద్దరు నేతలు జమిలి ఎన్నికల ఆలోచన చేస్తున్నట్టు తెలుగు బులెట్ విశ్లేషించింది.ఓ నాలుగు రోజులు కిందట 2018 చివరలో జంట ఎన్నికలకు ప్లాన్ రెడీ అవుతోందని రెండు వేర్వేరు కధనాలు ప్రచురించింది తెలుగు బులెట్.ఆ మాటల్ని నిజం చేస్తూ చంద్రబాబు పార్టీ శ్రేణుల్ని సమాయత్తపరుస్తున్నారు.మీ కోసం ఆ కధనాలు …

కొన్నాళ్లుగా ప్రధాని మోడీ దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే రూట్లో వెళ్తున్నారు. నిజానికి చంద్రబాబే మోడీకి ఈ ఐడియా ఇచ్చారన్న వాదనలు కూడా ఉన్నాయి. ఏదేమైనా పదేపదే ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధికి అడ్డంకులు ఎదురవుతున్నాయని చంద్రబాబు వాపోతున్నారు. ఆయన వాదనలో వాస్తవం లేకపోలేదంటున్నారు నిపుణులు. ప్రతిసారీ ఎన్నికల కారణంగా వృథాఖర్చు, సమయం వేస్ట్ కావడం జరుగుతోంది. అందుకే ఒకేసారి ఎన్నికలు జరిపితే అటు ఈసీకి, ఇటు పార్టీలకు కలిసొస్తుందనే మాట వినిపిస్తోంది.

జాతీయ పార్టీల సంగతి పక్కనపెడితే ప్రాంతీయ పార్టీలకు ప్రతిసారీ ఎన్నికలు ఎదుర్కోవడం తలకు మించిన పని. వాటితో పోలిస్తే వచ్చే విరాళాలు కూడా తక్కువే కాబట్టి ప్రచారానికి నిధులు ఖర్చుపెట్టడం కూడా కత్తి మీద సామే. అందుకే చంద్రబాబు ఒకేసారి ఎన్నికల జపం చేస్తున్నారని విమర్శకులు వాదిస్తున్నారు. కానీ బాబు ఆలోచనలో సదుద్దేశం ఉందంటున్నారు టీడీపీ నేతలు. ఐదేళ్లకోసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి పెట్టి.. ఆరు నెలల తర్వాత స్థానిక ఎన్నికలు పెడితే అందరికీ వీలుగా ఉంటుందనేదే తమ అధినేత ఉద్దేశమంటున్నారు.

గతంలో కూడా ఇలా ఒకేసారి ఎన్నికలపై చంద్రబాబు జాతీయస్థాయిలో సంప్రదింపులు జరిపారట. కానీ అప్పుడు అంతగా ఎవరూ ఆసక్తిచూపలేదు. కానీ ఇప్పుడు ప్రధాని మోడీ స్వయంగా ఈ ఆలోచన ముందుకు తీసుకురావడంతో.. చంద్రబాబు ఆలోచన ఈసారి సాకారమౌతుందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈసీ కూడా ఒకేసారి ఎన్నికలకు సముఖంగా ఉండటం, మెజార్టీ పార్టీలు ఖర్చు తగ్గుతుందని భావించడంతో.. ఏకకాలంలో ఎన్నికలకు రంగం సిద్ధమైందనే భావన ఉంది. కానీ కాంగ్రెస్ లాంటి పార్టీలు ఇంకా అడ్డుపుల్లలు వేస్తుండటంతో.. ఈ ప్రతిపాదన అమల్లోకి రావడానికి జాప్యం జరుగుతోంది.

modi strategy all states going to participate elections 2018 in india

దేశమంతా ఒక్కసారే ఎన్నికలు అంటూ ప్రధాని మోడీ నినాదం నినాదంగానే ఉంటుందనుకుంటున్నారా ? అయితే మీరు పప్పులో కాలేసినట్టే.2019 లోపే దేశమంతా జమిలి ఎన్నికలు జరిగేలా బీజేపీ పక్కా చర్యలు చేపట్టింది. 2018 చివరిలో దేశవ్యాప్తంగా ఒక్కసారే అటు లోక్ సభకి,ఇటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరపడానికి అవసరమైన ప్రయత్నాలు,ఏర్పాట్లు సాగిపోతున్నాయి.అయినా ఇది చెప్పినంత తేలిక కాదనే కదా మీ సందేహం. ఔను మీరు అనుకున్నది నిజమే కానీ రాజ్యాంగ సవరణతో ఆ అడ్డంకిని కూడా అధిగమించవచ్చు. అయితే ప్రస్తుతమున్న 29 రాష్ట్రాల్లో 15 రాష్ట్రాలు అసెంబ్లీలు జమిలి ఎన్నికలకు ఓకే చెప్పాలి. ఇది సాధ్యమే.దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బీజేపీ,దాని మిత్రపక్షాలు అధికారంలో వున్నాయి.అంత కన్నా ముఖ్యమైన విషయం ఇంకోటుంది.17 రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి 2018 చివరకు కాస్త అటుఇటుగా ముగుస్తోంది.ఇదే మోడీకి బాగా అచ్చి వస్తున్న అంశం.

ఇక మిగిలిన రాష్ట్రాలు ఎలా ఒప్పుకుంటాయి ? దీనికి కూడా ఓ పరిష్కారం ఆలోచించారు మోడీ అండ్ కో.2018 చివరకు రెండేళ్ల కన్నా తక్కువ కాలపరిమితి వున్న అసెంబ్లీలకు జమిలి ఎన్నికల జాబితాలో రాజ్యాంగ సవరణ ద్వారా చేరుస్తారు.ఇక రెండేళ్ల కన్నా ఎక్కువ కాలపరిమితి వున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఐదేళ్ల కాలపరిమితి ముగియగానే రాష్ట్ర పతి పాలన పెడతారు. 2023 లో అన్ని రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరుపుతారు.

21 states assembly elections list in 2018

2018 చివరిలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల జాబితా లో ఏపీ,తెలంగాణ వున్నాయి.వీటితో సహా మొత్తం 21 రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలు జరగనున్నాయి.

1 . గుజరాత్
2 . హిమాచల్ ప్రదేశ్
3 . ఛత్తీస్ గడ్
4 . కర్ణాటక
5 . మధ్య ప్రదేశ్
6 . మేఘాలయ
7 .మిజోరాం
8 .నాగాలాండ్
9 . త్రిపుర
10 . రాజస్థాన్
11 . ఆంధ్రప్రదేశ్
12 .తెలంగాణ
13 .అరుణాచల్ ప్రదేశ్
14 .హర్యానా
15 . జమ్మూ కాశ్మీర్
16 . జార్ఖండ్
17 . మహారాష్ట్ర
18 . ఒడిస్సా
19 . సిక్కిం
20 . ఢిల్లీ
21 . బీహార్