మోడీ వల్లే పోలవరం ఇక్కడిదాక వచ్చింది…

Posted December 30, 2016

chandrababu says polavaram project success reason only for modi పోలవరం కాంక్రీట్ పనులు ప్రారంభించడం నా పూర్వజన్మసుకృతం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు 5 కోట్ల మంది తెలుగు ప్రజలు ప్రార్థించాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• పోలవరం ఈ స్థాయికి రావడానికి కారణం నేనొక్కడినే కాదు..చాలా మంది కృషి ఉంది : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• ప్రధాని నరేంద్రమోదీ సహకరించడం వల్ల ఈ స్థాయికి వచ్చాం. కాంక్రీట్ పనులు ప్రారంభించుకున్నాం.మోదీ, జైట్లీ, వెంకయ్యనాయుడు,ఉమాభారతి,అశోక్ గజపతి రాజు,సుజనాచౌదరి కృషి మరువలేనిది. పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్లడానికి కారణమైన నరేంద్రమోదీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరపున, నా తరపున అభినందనలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• పోలవరం పూర్తయితే కష్టాలనేవి ఉండవు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• పోలవరం ఒకప్పుడు కలగా ఉండేది. పూర్తికావాలని ఆశ ఉండేది. ఆ ఆశ నెరవేర్చే సమయం ఆసన్నమైంది. కాటన్ దొర ఎక్కడో పుట్టాడు..మన వాడు కాదు.. అయినా మన ప్రజల కష్టాలు గుర్తించి అప్పట్లోనే పోలవరం కట్టాలని నిర్ణయించాడు.కానీ నిధులు సాధ్యం కాక ధవళేశ్వరం నిర్మించి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలకు నీరందించారు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• కాటన్ దొర ఆశయంతో ఉభయగోదావరి జిల్లాల్లో నాగరికత పెరిగింది.కరువు పోయింది. ఈ రెండు జిల్లాల ప్రజలు కాటన్ ను దేవుడిగా కొలుస్తున్నారు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• కాటన్ మానవ రూపంలో ఉన్న దేవుడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి ? – 150 ఏళ్ల క్రితమే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలనుకున్నా..పనులు శ్రీకారం చుట్టింది ఇప్పుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• 1941లో మద్రాస్ ప్రెసిడెన్సీలోని హయ్యర్ కూడా ఈ ప్రాజెక్టును చేపట్టాలని అనుకున్నారు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో పోలవరాన్ని చేర్చింది. కానీ ఆ పార్టీకి ప్రాజెక్టు పూర్తికావలన్న చిత్తశుద్ధి లేదు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• మోదీ అధికారం చేపట్టిన వెంటనే మొట్టమొదటి కేబినెట్ లో పోలవరానికి అవసరమైన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ తెచ్చారు. ఆ రోజే పోలవరానికి నేను శ్రీకారం చుట్టాను. మోదీ ప్రభుత్వం ఏడు మండలాలను ఏపీలో కలపకుంటే పోలవరం నిజంగానే కలగా మిగిలిపోయేది : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• గోదావరి పుష్కరాల్లో నేను ప్రార్థనలు చేశా..నా స్వార్థం కోసం కాదు…నా కుటుంబం కోసం కాదు..నా ఆరోగ్యం కోసం కాదు..పోలవరం కోసం చేశా. ఇప్పుడు ఆ కల సాకారమవుతున్నందుకు గోదావరమ్మ తల్లికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• పోలవరం ప్రాజెక్టు పూర్తికావడానికి సహకరిస్తున్న ఉభయగోదావరి జిల్లా రైతులకు శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నా : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• నేను ఇద్దరికే రుణపడి ఉన్నాను. ఒకటి పోలవరానికి భూములిచ్చిన రైతులు, గిరిజనులకు, రెండు అమరావతికి పైసా తీసుకోకుండా భూములిచ్చిన రైతులకు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• పోలవరం పూర్తయితే కరువు ఉండదు.అమరావతి పూర్తయితే సమస్యలుండవు ..: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• పోలవరం ప్రాజెక్టులో 20 లక్షల మంది నిర్వాసితులున్నారు. అందులో ప్రధానమైంది గిరిజనులు. పోలవరంకు సహకరిస్తున్న గిరిజనులు మనిషి రూపంలో ఉన్న దేవుళ్లు..కొత్త చట్టం ప్రకారం పోలవరం బాధితులందరికీ పరిహారం అందిస్తా..ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• పట్టిసీమ వస్తే ఎడారవుతుందని కొందరు రాజకీయాలు చేశారు..రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు..అయినా రైతులు ఆ మాటలు నమ్మలేదు..: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• ఉభయగోదావరి జిల్లాల రైతుల త్యాగాన్ని తాను జీవితంలో మరిచిపోను…పోలేను: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• పట్టిసీమ పుణ్యమా అని కృష్ణా డెల్టాలో ఈ ఏడాది రైతులు బ్రహ్మాండమైన పంట పండించారు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు