తప్పులు వెతికితే సీఎం కాలేరు

0
80

 Posted May 3, 2017 at 12:09

chandrababu take a class to nara lokeshముఖ్య మంత్రి చంద్రబాబు తన మంత్రివర్గ తీరుపై అసంతృప్తిగా ఉన్నారా అంటే ఔననే సమాధానమే ఇస్తున్నారు టిడిపి వర్గాలు. తాజాగా జరిగిన ఒక ప్రత్యేకమైన భేటిలో ఈ సందర్భంగా చాలా విషయాలు చర్చలోకి వచ్చాయట. అందులో ప్రధానంగా పార్టీ నేతలు బయట కాని మీడియా తో కాని మాట్లాడేటప్పుడు నోరు పారేసుకుని చులకన అయ్యే అవకశాన్ని ఇస్తున్నారని దీన్ని ఆసరాగా చేసుకునే మీడియాలో ఒక వర్గం, సోషల్ మీడియా లో ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు ఇస్తుందని అన్నట్టు తెలిసింది.

ఆ మధ్య జలీల్ ఖాన్ బికాం ఫిజిక్స్ వ్యవహారం ఎంతటి దుమారం కామెడీ చేసిందో అందరికి తెలిసిందే. దీనితో పాటు మరో ఆసక్తికర వార్త కూడా ఇప్పుడు టిడిపి సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదే చంద్రబాబు తన వారసుడు లోకేష్ కి ప్రత్యేకంగా ఏకాంత ప్రదేశంలో క్లాసు పీకడం గురించి. వారు చెప్పుకుంటున్న కథనం ప్రకారం బాబు లోకేష్ కి ప్రత్యేకంగా పబ్లిక్ స్పీకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, లేకపోతే ఎదుర్కోవాల్సి వచ్చే పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పినట్టు టాక్ వచ్చింది. ఆ మధ్య అంబేద్కర్ జయంతి సభలో వర్ధంతి అనడం, మరో సభలో స్వాతంత్ర్యం వచ్చి 66 ఏళ్ళు అయ్యింది అని వ్యాఖ్యానించడం, వేరే చోట జగన్ సిఎం గా ఉన్నప్పుడు ఏం చేసారో చెప్పాలి అని కామెంట్ చేయటం ఒకటి రెండు కాదు మీడియా ముందు చినబాబు దొరికిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి.

కానీ లోకేష్ కు చంద్రబాబు క్లాస్ పీకారన్న వార్తల్లో వాస్తవం లేదంటున్నాయి టీడీపీ వర్గాలు. వైసీపీ అనుకూల మీడియా ఈ విధంగా ప్రచారం చేస్తోందని, అసలు లోకేష్ కు క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఏముందని ఎదురుప్రశ్నిస్తున్నాయి. పొరపాటున జయంతి బదులు వర్థంతి అన్నారే కానీ, ఉద్దేశపూర్వకం కాదని, నిజానికి లోకేష్ చేసిన తప్పులు కంటే.. మీడియా పీకుతున్న కోడిగుడ్డుపై ఈకలే ఎక్కువయ్యాయని సెటైర్లు పడుతున్నాయి. లోకేష్ తప్పులు పడితే జగన్ సీఎం అయిపోరని గుర్తుపెట్టుకోవాలంటున్నాయి టీడీపీ వర్గాలు.