వర్మ శల్య సారధ్యంపై బాబుకి టెన్షన్…

Posted December 27, 2016

chandrababu tensed about varma
వంగవీటి సినిమా విషయంలో రాధా,వర్మ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రాధా కృష్ణ వాడు,వీడు,సంగతి తేలుస్తా లెవెల్లో వార్నింగ్ ఇస్తే …నన్ను అంతం చేయాలనుకుంటే మీరు అంతమైపోతారు అని కౌంటర్ కి దిగాడు.దీన్నింకా సాగదీస్తే రంగా,రత్న కుమారి గురించి వారి అభిమానులకి నచ్చని ఎన్నో డాక్యుమెంట్ ఎవిడెన్స్స్ బయటపెడతానని వార్నింగ్ ఇచ్చేసాడు. బయటికి ఇదంతా రాధా,వర్మ మధ్య వార్ లా కనిపిస్తోంది.అయితే వర్మ అంటున్న మాటలు,చేస్తున్న పనులు ఆయనకి తెచ్చే చేటు కన్నా కాపుల రూపంలో టీడీపీ కి జరిగే నష్టం ఎక్కువని చంద్రబాబు దగ్గర ఆ వర్గానికి చెందిన నేత ఒకరు చెప్పారట.రాధాకి వ్యతిరేకంగా మాట్లాడుతూనే టీడీపీ కి వర్మ నష్టం చేస్తున్నాడని బాబు కూడా కన్విన్స్ అయ్యారంట.అయితే వర్మ ఒకరు చెపితే వినే రకం కాకపోవడంతో ఈ శల్యసారధ్యాన్ని ఎలా ఎదుర్కోవాలో అని తల పట్టుకుంటున్నారట.

మరో వైపు ఈ అంశాన్ని కాపులు,టీడీపీ మధ్య వైరంగా మార్చేందుకు వైసీపీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.రాధా వైసీపీ నేత కావడంతో తాజా అంశాన్ని వినియోగించుకోడానికి ఆ పార్టీ నేతలు,అనుకూల సోషల్ మీడియా గట్టిగానే ప్రయత్నిస్తోంది.ముద్రగడ ఉద్యమాన్ని దీనితో ముడిపెట్టేందుకు కూడా కొందరు ట్రై చేస్తున్నారు.ఏదేమైనా వర్మ రూపంలో బాబుకి ఇంకో టెన్షన్ మొదలైంది .