“సమరచంద్రబాబు”…టైటిల్ లానే మ్యాటర్ కూడా స్పెషల్

0
105

Posted April 27, 2017 at 11:59

chandrababu thinking to put tdp mahanadu meeting in kadapa
అప్పుడెప్పుడో బాక్సాఫీస్ ని కుమ్మిపారేసిన సమరసింహా రెడ్డి సినిమా లో బాలయ్య డైలాగ్స్ అందరి నోట్లో తెగ నానాయి.దశాబ్దాలు గడిచాయి కదా ..ఆ డైలాగ్స్ మర్చిపోకపోయినా ఇప్పుడు గుర్తు కు వచ్చే అవకాశాలు తక్కువే.కానీ బాలయ్య బావ,ఏపీ సీఎం చంద్రబాబు కొత్తగా ఈ డైలాగ్స్ వల్లెవేస్తున్నట్టుంది.”నీ ఇంటికొస్తా..నీ నట్టింటికొస్తా ” అంటూ చంద్రబాబు తన సహజశైలికి భిన్నంగా ప్రతిపక్ష నేత జగన్ కి చెప్పాలని తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది.అందుకే బాబు కాస్తా …”సమరచంద్రబాబు” అయ్యారు.ఇంతకీ ఆ పేరు,దాని వెనుక మ్యాటర్ ఏంటనేగా మీ డౌట్ .అక్కడికే వస్తున్నా.

ఈ ఏడాది మహానాడు వేదిక ఎక్కడన్నదానిపై టీడీపీ లో ఇంకా స్పష్టత రాలేదు.విశాఖ లో జరపొచ్చని ప్రముఖంగా వినిపిస్తున్న మాట.కానీ ఓ ట్విస్ట్ కి కూడా అవకాశం ఉందని ఇన్ సైడ్ సోర్స్. అదే కడపలో మహానాడు నిర్వహణ.ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలైన వైసీపీ ని చావుదెబ్బ తీసేందుకు కడపలో మహానాడు నిర్వహించాలని ఇటీవల మంత్రివర్గంలో చేరిన ఒకప్పటి వైసీపీ నేత ఆదినారాయణ రెడ్డి బాబుకి సలహా ఇచ్చారట.ముందుగా ఈ ప్రతిపాదనపై ఆశ్చర్యపోయిన బాబు తర్వాత దాని వల్ల పార్టీకి జరిగే ప్రయోజనాల్ని అంచనా వేసుకుని విషయాన్ని సీరియస్ గానే పరిశీలిస్తున్నారట.కడపలో మహానాడు ద్వారా ఆ జిల్లాతో పాటు పార్టీ బలం పుంజుకోవాల్సిన రాయలసీమలో కొత్త ఉత్సాహం వస్తుందని మంత్రి ఆదినారాయణ రెడ్డి బాబుకి వివరించారట.కడపలో మహానాడుకి విజయవంతం చేస్తే జగన్ ని నైతికంగా దెబ్బకొట్టొచ్చని కూడా అది చెప్పారట.ఈ ప్రతిపాదన నిజమైతే ..బాబు “సమరచంద్రబాబు” కాదంటారా?