దాసరికి బాబు పరామర్శ ..

Posted February 3, 2017

chandrababu visits and enquiries to dasari narayana rao health
అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న దర్శకరత్న దాసరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు.త్వరగా దాసరి కోలుకోవాలని బాబు ఆకాక్షించారు. రామోజీని పలకరించిన బాబు అక్కడనుంచి కిమ్స్ కి వెళ్లారు. కొన్నాళ్లుగా కాపు రిజర్వేషన్ ఉద్యమం నడుపుతున్న ముద్రగడ పద్మనాభం హైదరాబాద్ లో చర్చలు,సమావేశాలు దాసరి ఇంటిలో జరపడం అందరికీ తెలిసిందే. ఆ భేటీల తర్వాత బాబు టార్గెట్ గా అందులో పాల్గొంటున్న నేతలు మాట్లాడుతున్నారు.దాసరి కూడా ఒకటిరెండు సందర్భాల్లో బాబుకి వ్యతిరేకంగా,జగన్ కి అనుకూలంగా గళం విప్పారు.ఈ పరిస్థితుల్లో దాసరి వద్దకు బాబు వెళతారా అన్న సందేహాలు అక్కడక్కడా వ్యక్తమైనప్పటికీ చంద్రబాబు ఆయన్ని పరామర్శించారు.

• దాసరి నారాయణరావుతో ఒక కుటుంబ సభ్యుడి మాదిరిగా కలిసి ఉన్నాం : సీఎం చంద్రబాబు నాయుడు

• నేనంటే దాసరికి చాలా అభిమానం : సీఎం చంద్రబాబు నాయుడు

• దాసరి, నేను సన్నిహితంగా కూడా పనిచేశాం. జన్మభూమి సాంగ్ కూడా ఆయనే రాసి, రికార్డింగ్ చేయించారు: సీఎం చంద్రబాబు నాయుడు

• దాసరి చాలా కులాసాగా ఉన్నారు : సీఎం చంద్రబాబు నాయుడు

• ఆక్సిజన్ పీల్చుకోవడంలో చిన్నపాటి సమస్యతో మాట ఇంకా పూర్తిగా రావడం లేదు : సీఎం చంద్రబాబు నాయుడు

• మనిషి మాట్లాడటం, పరామర్శించడం, పాతవన్నీ కూడా చెప్పడం అన్నీ కూడా పాజిటివ్ గా ఉన్నారు : సీఎం చంద్రబాబు నాయుడు

• రెండు రోజుల్లో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి వస్తారని డాక్టర్లు చెప్పారు : సీఎం చంద్రబాబు నాయుడు

• నిన్నటి వరకూ వెంటిలేటర్ పై ఉన్నారని రకరకాల పుకార్లు వచ్చాయి : సీఎం చంద్రబాబు నాయుడు

• నేను నేరుగా చూసి, పలకరించడం.. అప్యాయతగా మాట్లాడటం అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను నాకు పరిచయం చేయడం మంచి వాతావరణంలో ఒక ఆత్మీయుని కలవడం చాలా సంతోషంగా ఉంది : సీఎం చంద్రబాబు నాయుడు

• దాసరి తొందరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను : సీఎం చంద్రబాబు నాయుడు

• వీలైనంత త్వరగా మళ్లీ దైనందిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను : సీఎం చంద్రబాబు నాయుడు

• డాక్టర్లు కూడా బాగా పనిచేశారు. వారికి కూడా నా ధన్యవాదాలు : సీఎం చంద్రబాబు నాయుడు

• నాకు తెలియగానే ప్రభుత్వం తరపున ప్రభుత్వ విఫ్ కాల్వ శ్రీనివాసులను పంపించాను : సీఎం చంద్రబాబు నాయుడు

• కానీ ఎంతమంది వచ్చినా నేను చూస్తే వచ్చే ఆనందం ఇంకొకటి కాదు. ఆయనతో నాకుండే వ్యక్తిగత సంబంధాలు, వారితో ఉండే సన్నిహిత సంబంధాలతో నేను కూడా వచ్చి చూశాను. ఆయన వేగంగా కోలుకోవడం చాలా సంతోషంగా ఉంది : సీఎం చంద్రబాబు నాయుడు