బాబు పోసిన నీళ్లు పెట్రోల్ అయి మండుతోంది..

0
94

 Posted May 3, 2017 at 16:45

chandrababu worried about on prakasam district politicsటీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లాలో మంటలు ఆర్పడానికి నీళ్లు పోస్తే అది పెట్రోల్ అయి మండుతోంది.ఇప్పుడు ఏమి పోస్తే ఆ మంటలు ఆరతాయో బాబుగారికి అర్ధం కావడం లేదు. ఇంతకీ ఆ నీళ్లు,నిప్పుల సంగతి ఏంటో తెలుసుకోవాలంటే కాస్త డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే. 2014 ఎన్నికల్లో కోస్తా లో టీడీపీ కి ప్రజలు బ్రహ్మరధం పట్టారు.అయితే ఆ విజయయాత్రకి ప్రకాశం జిల్లా సగం నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి.ఆ జిల్లా సగం నుంచి వైసీపీ కూడా గణనీయ ఫలితాలు సాధించింది.ఆ పార్టీ అభ్యర్థులు ఇక్కడ మొదలుకొని సీమలో అనంతపురం తప్ప మిగిలిన చోట్ల గట్టి ఫలితాలే సాధించారు.అందుకే ఇక్కడ నుంచే వైసీపీ స్పీడ్ కి బ్రేకులు వేయాలని బాబు ప్లాన్ వేశారు. ఆపరేషన్ ఆకర్ష్ కి తెర లేపారు. వైసీపీ ఎమ్మెల్యేల్ని పార్టీలోకి తీసుకున్నారు.పార్టీ బలోపేతం కోసం తీసుకున్న ఈ చర్య టీడీపీ లో ఆధిపత్య పోరాటానికి దారితీసింది.మరీ ముఖ్యంగా అద్దంకి,చీరాల లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి.

అద్దంకిలో బలరాం,గొట్టిపాటి వర్గాలు,చీరాలలో ఆమంచి,పోతుల సునీత వర్గాలు పదేపదే టీడీపీ పరువుని రచ్చకెక్కించాయి.దీంతో ఈ సమస్య పరిష్కారం కోసం,కలహాల జ్వాలలపై నీళ్లు చల్లేలా బాబు అతి కష్టమైన,క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ సీట్ల కోసం ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ బలరాం,సునీతలకి ఒకే సారి పదవులిచ్చారు.ఈ దెబ్బతో సమస్య పరిష్కారం అవుతుందని పార్టీలో శాంతి నెలకొంటుందని భావించారు.ఈ రెండు నియోజకవర్గాలు బాపట్ల పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి.కాబట్టి బలరాం,సునీత కి నచ్చచెప్పే స్థాయి వున్న పరిటాల సునీతను ఇన్ ఛార్జ్ గా వేశారు.బాబు తీసుకున్న ఈ నిర్ణయాలు సమస్యను తగ్గించకపోగా రెట్టింపు చేశాయి. కొత్తగా వచ్చిన పదవులతో బలరాం,పోతుల సునీత లు స్థానిక ఎమ్మెల్యేలైన గొట్టిపాటి రవికుమార్, ఆమంచికి చుక్కలు చూపిస్తున్నారు.దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు హైకమాండ్ కి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు.ఎమ్మెల్సీ ఇస్తే నియోజకవర్గంలో ఇబ్బందులు రాబోవని చెప్పి ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని లోకేష్ దగ్గర చెప్పుకోడానికి డిసైడ్ అయ్యారు.ఏమైనా బాబు నీళ్ళని పోసింది పెట్రోల్ అయి మండుతోంది మాత్రం నిజం.