బాబును ఢిల్లీ మెట్రో ఎక్కొద్దన్న ఇంటెలిజెన్స్

0
81

Posted May 11, 2017 at 12:05

chandrababu z+ category by intelligenceఎర్రచందనం స్మగ్లర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని, జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ ఢిల్లీ పర్యటనల్లో ఇకపై మెట్రో రైలులో ప్రయాణం మంచిది కాదని నిఘా విభాగం హెచ్చరించింది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై రాష్ట్ర నిఘా విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎర్రచందనం స్మగ్లర్లతో చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ రెసిడెంట్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది.

చంద్రబాబు ఢిల్లీ పర్యటనల్లో ఇకపై మెట్రో రైలులో ప్రయాణం మంచిది కాదని, జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ మెట్రో ప్రయాణం ప్రమాదకరమని నిఘా విభాగం హెచ్చరించింది. మెట్రో’లో సీఎంకు భద్రత కల్పించడం ఇబ్బందికరమని, ఢిల్లీ పర్యటనలో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో, సాయుధ కమాండో రక్షణలో రోడ్డుమార్గం ద్వారానే చంద్రబాబును తీసుకువెళ్లాలని, ఉగ్రవాదులు, మత ఛాందసవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిఘా విభాగం హెచ్చరించింది.

అయితే నిఘా విభాగం హెచ్చరికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అయితే మాత్రం మెట్రో రైల్లో సేఫ్టీ ఎందుకుండదనే వాదన తెరపైకి వచ్చింది. మొన్నటికి మొన్న ప్రధాని మోడీ ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్ బుల్ తో కలిసి మెట్రో ప్రయాణం చేశారు. దేశ ప్రధానికంటే చంద్రబాబుకు ఎక్కువ థ్రెట్ ఎలా ఉంటుందనేది విమర్శకుల వాదన. ఏదేమైనా ఇంటెలిజెన్స్ జారీ చేసే హెచ్చరికలు ఒక్కోసారి మరీ కామెడీగా ఉంటున్నాయనే మాట కూడా వినిపిస్తోంది.