చిరు మాట పెడ చెవిన పెట్టిన చరణ్..!

Posted December 10, 2016

Charan Shock To Chiranjeevi Dhruva Run Timeమెగాస్టార్ చిరంజీవికి 149 సినిమాల అనుభవం ఉంది. సినిమా ఏయే కోణాల్లో ఆడియెన్స్ మెప్పు పొందేలా చేస్తుందో తెలుసు. అయితే ధ్రువ విషయంలో చిరు సలహా పాటించకుండా చరణ్ తన సొంత నిర్ణయం తీసుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ధ్రువ సినిమా 2 గంటల 39 నిమిషాలు. అయితే సినిమా ఫస్ట్ కాపీ చూసిన మెగాస్టార్ సినిమా ఓ 20 నిమిషాలు ఎడిటింగ్ చేయించమని అన్నారట.

కాని సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో సురేందర్ రెడ్డి ట్రిమ్మింగ్ కు సిద్ధమైనా చెర్రి వద్దనేశాడట. చరణ్ కాన్ఫిడెన్స్ చూసి చిరంజీవి కూడా సరే అనేశాడట. అయితే నిన్న రిలీజ్ అయిన ధ్రువ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కాని లెంగ్త్ విషయంలో కాస్త నిరాశ పడేలా చేసింది. ఎక్కడ బోర్ అన్నది లేదు కాని కాస్త లెంగ్త్ ఎక్కువ అయ్యింది అన్న ఫీలింగ్ రాక మానదు.

ఒకవేళ చిరు చెప్పిన చేంజెస్ చేసి రిలీజ్ చేసి కేవలం 2 గంటల 15 నిమిషాలే సినిమా రిలీజ్ చేసి ఉంటే ఎలా ఉండేదో మరి. అప్పటికి సెకండ్ హాఫ్ లో పరేషానురా సాంగ్ ఒక్క చరణంతోనే సరిపెట్టేశారు. సో ఇలా లెంగ్త్ వల్ల చరణ్ ధ్రువకు కష్టాలు వచ్చి పడ్డాయన్నమాట.