చరణ్ మరో షాక్ ఇచ్చేందుకు రెడీ..!

Posted December 21, 2016

Charan Surprise Look In Sukumar Movie

రీసెంట్ గా వచ్చిన ధ్రువ సినిమాతో తన స్టామినా ఏంటో చూపించిన మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ సరికొత్త మేకోవర్ తో ఫ్యాన్స్ ను మరింత ఖుషి చేశాడు. తనను తాను ఇలా కొత్తగా ప్రెజెంట్ చేసేందుకు చెర్రి బాగానే కష్టపడ్డాడు. అయితే ధ్రువ తర్వాత చెర్రి సుకుమారె డైరక్షన్లో కమిట్ అయ్యాడు. తన క్రియేటివిటీతో క్రేజీ సినిమాలను చేస్తున్న సుక్కు మహేష్ తో 1 నేనొక్కడినే, ఎన్.టి.ఆర్ తో నాన్నకు ప్రేమతో చేశాడు. అయితే ఇప్పుడు చరణ్ తో ఓ పిరియాడిల్ మూవీ ప్లాన్ చేస్తున్న సుకుమార్ సినిమాలో చెర్రి లుక్ కూడా కొత్తగా చూపిస్తాడట.

చెర్రి ఇదవరకు చూడని లుక్ తో సుకుమార్ సినిమాలో ఉంటాడని అంటున్నారు. ఇప్పటికే దానికి సంబందించిన పనులు మొదలుపెట్టాడట. ఇప్పటికే ధ్రువ సినిమాలో చెర్రి లుక్ కమిట్మెంట్ చూసి వారెవా అనిపించిన ఫ్యాన్స్ మరోసారి సుకుమార్ సినిమాలో కూడా అదేవిధంగా ఫీల్ అవ్వడం ఖాయమంటున్నారు. సంక్రాంతి తర్వాత ముహుర్తం పెట్టనున్న ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని తెలుస్తుంది.

ఇక ఇన్నాళ్లు ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ కూడా టచ్ చేయలేని చరణ్ ధ్రువతో అది బీట్ చేసి తన సత్తా చాటాడు. సురేందర్ రెడ్డి డైరక్షన్లో వచ్చిన ధ్రువ మూవీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.