చిన్నమ్మ ముందు రెండే ఆప్షన్లు!!

Posted December 24, 2016

chiamma has two options
తమిళనాడు పాలిటిక్స్ రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. బీజేపీ హైకమాండ్ అన్ని వైపుల నుంచి శశికళపై ఒత్తిడి పెంచేసింది. పన్నీర్ సెల్వం అప్పుడే కేంద్రం దారిలోకి వచ్చేశారు. ఇక తేలాల్సింది చిన్నమ్మ కథే.

ఐటీ దాడులతో అన్నాడీఎంకేలో ఇప్పటికే గుబులు రేపింది కేంద్రం. మాజీ సీఎస్ రామ్మోహన్ రావును క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ తర్వాతైనా శశి బ్యాచ్ తగ్గుతుందేమోనని ఢిల్లీ పెద్దలు అంచనా వేశారు. అయినా చిన్నమ్మ వర్గం మాత్రం అన్నాడీఎంకేపై పట్టుకోసం వెంపర్లాడుతూనే ఉందట. పన్నీర్ సెల్వం కూడా పార్టీలో జరుగుతున్న రచ్చను కేంద్రానికి చేరవేశారట. దీంతో ఢిల్లీ పెద్దలు శశికళకు రెండు ఆప్షన్లు పెట్టారు. ఒకటి తలొంచడం. రెండోది తలపడడం. ఏదో ఒకటి త్వరలో తేల్చుకోవాలి అని ఆల్టిమేటం విధించారట.

ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నమ్మ అంత ఈజీగా కేంద్రానికి తలొగ్గుతారా అన్నది కష్టమే. అయినప్పటికీ ఐటీ దాడులతో ఆమెలోనూ గుబులు మొదలైందట. శశికళపై ఐటీ శాఖ ఫోకస్ చేస్తే ఆమె జైలుకెళ్లే అవకాశాలే ఎక్కువ. ఇది ఆమెకు కూడా తెలుసు. అదే సమయంలో కేంద్రంతో ఢీ కొట్టేంత సాహసం చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మొదటి ఆప్షన్ వైపే మొగ్గు చూపవచ్చని ప్రచారం జరుగుతోంది. ఏ రకంగా చూసినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు ఇంతకంటే బెటర్ ఆప్షన్ లేదంటున్నారు విశ్లేషకులు.