చైనా కోతి కి ట్రంప్ నచ్చాడు.

Posted November 5, 2016

next american president elections are being most intersting news. the chinese monkey fortune teller had selected the trump photo as the next us presidentఅమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోంది.ఎవరు గెలుస్తారన్నదానిపై ఇక్కడ పల్లెటూళ్లలో కూడా వాదించుకుంటున్నారు. పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేయడంతో వారి కుటుంబాల్లో కూడా ఆ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.ఎక్కువమంది ఎన్నారై లకి చెందిన కుటుంబాలు హిల్లరీ గెలవాలని కోరుకుంటున్నారు.కొద్ది మంది మాత్రం ట్రంప్ వచ్చినా నష్టం లేదనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నారై ఆశలపై నీళ్లు చల్లింది ఓ చైనా కోతి …
చైనాలో కోతి జోస్యానికి రారాజులాంటిది గెడా అనే పేరున్న కోతి .షియాన్షు ఎకోలాజికల్ పార్క్ లో వుండే ఈ కోతి జోస్యం మీద చాలా మందికి నమ్మకముంది.కిందటేడు యూరోపియన్ సాకర్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఎవరు గెలుస్తారో ఈ కోతి కచ్చితంగా ఊహించిందట..అందుకే ఇప్పుడు దాని ముందుకు అమెరికా అధక్ష్య పీఠం అంశాన్ని తీసుకెళ్లారు.హిల్లరీ క్లింటన్,డోనాల్డ్ ట్రంప్ కటౌట్ లని ఆ కోతి ముందు ఉంచితే అది వెంటనే ట్రంప్ చిత్రపటాన్ని ముట్టుకుంది.దానికి ట్రంప్ అంతగా ఎందుకు నచ్చాడో మరి !