చిన్నమ్మకు ముందు నుయ్యి… వెనక గొయ్యి

Posted December 29, 2016

chinamma in troubles
జయ మరణంతో అప్పటిదాకా ఒక వెలుగు వెలిగిన శశికళకు కష్టకాలం వచ్చి పడింది. అమ్మ తర్వాత తానే అంతా చక్రం తిప్పుదామనుకుంటే… పరిస్థితులు కలిసి రాలేదు. బలహీనుడు అనుకున్న పన్నీర్ సెల్వం బీజేపీతో కలిసి స్ట్రాంగ్ అయిపోయాడు. ఇక ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ పేరును ప్రకటించడం లాంఛనమే అనుకుంటున్న తరుణంలో శశికళ పుష్ప లాంటి వారు చిన్నమ్మను టెన్షన్ పెడుతున్నారు. అటు జయ మేనకోడలు ఇంకాస్త టెన్షన్ పెడుతోంది. ఇక ఢిల్లీ పెద్దలు చిన్నమ్మకు పదవిరాకుండా ఎత్తులేస్తున్నారు. ఈ తరుణంలో జయలలిత మరణానంతరం తొలిసారి అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఇందులో చిన్నమ్మ ఏ స్టాండ్ తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

త్వరలో జరిగే ఉప ఎన్నికలో జయ స్థానంలో శశికళ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీలో ప్రస్తుతానికి ప్రధాన కార్యదర్శి పదవి తీసుకుంటే.. అమ్మ అభిమానుల దృష్టిలో చిన్నమ్మ విలన్ అవుతుంది. అటు ఢిల్లీ పెద్దలు కూడా శశికళ అధికారాన్ని కోరుకుంటోందని అనుకుంటారు. అలా అయితే బై ఎలక్షన్ లో ఆమె గెలుపు కష్టమే. ఒకవేళ పార్టీ పదవి తీసుకోకుంటే చిన్నమ్మకు అన్నాడీఎంకేలో ప్రాధాన్యం అస్సలు ఉండదు.ఎందుకంటే ఆమె ఏ పదవిలోనూ లేదు.. అన్నింటికి మించి అమ్మ లాంటి స్ట్రాంగ్ పర్సనాలిటీ ఆమె వెనక లేదు. సో ఇప్పటిదాకా కాళ్లు మొక్కిన మంత్రులు, ముఖ్య నాయకులు చిన్నమ్మను లెక్కచేయరు. జరగరానిదే జరిగితే… శశికళను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

జయలలితను దగ్గర్నుంచి చూసిన శశికళ లాభనష్టాలన్నీ పక్కాగా బేరీజు వేసుకుందట. అందుకే సర్వసభ్య సమావేశంలో మౌనంగా ఉండడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చేసిందట. పార్టీలో వచ్చే అభిప్రాయాల ఆధారంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుందామని చిన్నమ్మ డిసైడ్ అయిపోయిందట. కానీ అది అంత ఈజీగా జరిగే పని కాదు. అంటే మొత్తానికి శశికళకు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న మాట సరిగ్గా సూటవుతుందన్న మాట!!

Post Your Coment
Loading...