అమ్మ పోయింది. ఫోటో మాయమైంది!!

Posted December 30, 2016

chinamma photo changed by tamil politicians
జయలలిత బతికున్నంత కాలం అన్నాడీఎంకేలో ఆమె మాటే శాసనం. అమ్మ చెప్పిందే వేదం. ఆమె దర్శనం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యూ కట్టేవారు. దూరం నుంచే అమ్మకు దండం పెట్టి పాదాభివందనం చేసే వారు. అమ్మ కరుణ కోసం ఆమె ఫోటోను జేబుల్లో కనిపించేలా పెట్టుకునే వారు. ఇదే ఆ తర్వాత సంప్రదాయంగా మారింది. అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తల జేబుల్లో అమ్మ ఫోటో కంపల్సరీ అయిపోయింది.

అమ్మ పోయాక అన్నాడీఎంకే నేతలు రూటు మార్చేశారు. చిన్నమ్మకు పార్టీ పగ్గాలిచ్చిన తరుణంలో ఇది స్పష్టంగా తెలిసిపోయింది. సమావేశానికి వచ్చిన మంత్రులు, పార్టీ నాయకుల జేబుల్లో పురుచ్చితలైవి చిత్రపటమే కనిపించలేదు. అమ్మ ఎవరో తెలియనట్టుగా ఆమె ఫోటోను విస్మరించారు. షాకింగ్ న్యూస్ ఏంటంటే.. అమ్మ ఫోటోను పెట్టుకోని సదరు నాయకులు… చిన్నమ్మ ఫోటోతో దర్శనమిచ్చారు. చాలామంది జేబుల్లో శశికళ ఫోటో కనిపించింది. ఆమెకు పార్టీ పగ్గాలిచ్చిన తర్వాత వాళ్లంతా శశి ఫోటోను అందరికీ కనిపించేలా పెట్టుకొని తెగ హడావుడి చేశారు. మరికొందరేమో చిన్నమ్మ ఫోటోలున్న టీ-షర్డులతో హల్ చల్ చేశారు.

రాజకీయ చదరంగం అంటే ఇదేనేమో. ఎక్కడ అధికారం ఉంటుందో.. అక్కడ భజనమండలి కనిపిస్తుంది. ఒక్కసారి ఆ వ్యక్తే లేడంటే.. పట్టించుకునే వారుండరు. దీనికి జయలలిత కూడా అతీతం కాదని నిరూపించారు కొందరు అన్నాడీఎంకే నేతలు. అయితే ఈ ఫోటో వార్త అటు ఇటు తిరిగి చిన్నమ్మ దాకా వెళ్లిందట. అన్నాడీఎంకే నాయకుల జేబుల్లో తన ఫోటో కనిపించిందంటే తన పాపులారిటీ పెరిగిందని ఫుల్ ఖుష్ అయ్యిందట చిన్నమ్మ.