చిన్నమ్మ సీఎం కానుందా?

chinamma to become cm

Posted December 30, 2016

chinamma to become cmతమిళనాడులో అమ్మ పోయింది.. ఇంకేముంది అంతా ఖతం. ఇక ఢిల్లీదే రాజ్యం అనుకున్న బీజేపీకి స్ట్రాంగ్ షాకిచ్చింది చిన్నమ్మ. రాజకీయంలో తాను అమ్మకు ఏమాత్రం తీసిపోనని చాటిచెప్పింది. బీజేపీ కంటే శశికళ రెండాకులు ఎక్కువే చదివిందని తేలిపోయింది.

శేఖర్ రెడ్డి, రామ్మోహన్ రావు ఎపిసోడ్ల తర్వాత పార్టీ పగ్గాల విషయంలో చిన్నమ్మ ఈజీగా దారిలోకి వచ్చేస్తుందని కేంద్ర పెద్దలు భావించారు. కానీ ఇక్కడే శశి ఏంటో తెలిసింది. ఆమె చాలా తెలివిగా ప్రవర్తించింది. ఏ పన్నీర్ సెల్వంనైతే తనపై అస్త్రంగా ప్రయోగిస్తున్నారో.. అదే సెల్వం ఇప్పుడు చిన్నమ్మ ఎంపికను ప్రకటించాల్సి వచ్చింది. ఇక పార్టీ క్యాడర్ కూడా చిన్నమ్మ నామస్మరణ జపించడం చూస్తుంటే…పరిస్థితి సెల్వం సారుకు ఏమాత్రం అనుకూలంగా లేదని స్పష్టమైపోయింది.

అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే.. శశికళ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత… కొంత గ్యాప్ ఇచ్చి.. సీఎం ఛైర్ లో కూర్చుంటారని చెబుతున్నారు. అన్నాడీఎంకే మహిళా నేతలు బహిరంగంగానే దీన్ని నిర్ధారించారు. చిన్నమ్మ సన్నిహితుల నుంచి ఈ ప్రకటన రావడంతో ఇప్పుడు ఫ్యూచరేంటో కొంత క్లారిటీ వచ్చేసింది. పన్నీర్ సెల్వం రాజీనామా చేయడం లాంఛనేనని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ దిమ్మ తిరిగేలా.. ఇక శశికళ సీఎం ఛైర్ లో కూర్చుంటారని టాక్. అది జరిగితే ఢిల్లీతో అమీతుమీకి చిన్నమ్మ సిద్ధపడినట్టేనని అనుకోవాల్సిందే!!