ఓడి గెలిచిన చిన్న‌మ్మ‌!!!

Posted February 17, 2017

chinamma won by going to jail
ప‌న్నీర్ సెల్వం తిరుగుబాటుతో ఢిల్లీ- చిన్న‌మ్మ మ‌ధ్య యుద్ధం మొద‌లైంది. ఈ స‌మ‌రంలో ఆమెకు ఘోర ప‌రాజ‌యం ఖాయ‌మ‌ని అనుకున్నారంతా. అందుకు త‌గ్గ‌ట్టుగానే శ‌శిక‌ళ‌కు జైలుశిక్ష ప‌డ‌డంతో ఇక ఆమె ఓట‌మి ప‌రిపూర్ణ‌మైంద‌న్న వాద‌న వినిపించింది. కానీ అస‌లు క‌థ అప్పుడే మొద‌లైంద‌ని ఆ త‌ర్వాతే తెలిసింది.

అక్ర‌మాస్తుల కేసులో శ‌శిక‌ళ‌కు జైలుశిక్ష ప‌డ‌డంతో రేసులో తాత్కాలికంగా మాత్ర‌మే ఆమె ఓడిపోయింది. కాదు ఓడిపోయిన‌ట్టు న‌టించింద‌ని చెప్ప‌డం క‌రెక్ట్. ఎందుకంటే క‌థ అక్కడితో ముగియ‌లేదు. తాను చెర‌సాల‌కు వెళ్ల‌బోతున్న విష‌యం ఆమెకు ముందే అర్థ‌మైంది. ఏదో జ‌ర‌గ‌బోతుంద‌ని… ముందే ఊహించింది. అందుకోసం ముందే ప్రిపేర్ అయిపోయింది. మాన‌సికంగా సిద్ధమైపోయింది. తాను జైలుకెళ్తే ఏం చేయాలో త‌న అనుచ‌ర‌గ‌ణానికి హింట్ ఇచ్చింది. బ‌య‌ట‌కు మాత్రం తాను వ్యూహ‌ర‌చ‌న చేయ‌కుండా.. సైలెంట్ గా ఉండిపోయాన‌ని ప్ర‌చారం జ‌రిగేలా చూసుకుంది.

ఇక సీఎం అభ్య‌ర్థిగా త‌న బ‌దులు సెంగొట్ట‌య‌న్ పేరు ప్ర‌చారం చేయ‌డం కూడా వ్యూహంలో భాగంగానే జ‌రిగింద‌ట‌. ఎందుకంటే ప‌ళ‌నిస్వామిని ముందే ఎంపిక చేశార‌ట‌. కానీ రేసులో మాత్రం సెంగొట్ట‌య‌న్ ఉన్నార‌ని లీకులు వ‌చ్చాయి. త‌ద్వారా సెల్వం వ‌ర్గంతో పాటు ఢిల్లీ పెద్ద‌ల‌కు షాకివ్వాల‌ని ముందే అనుకున్నార‌ట‌. అందుకే ఆమె జైలుకెళ్లే వ‌ర‌కు ప‌ళనిస్వామి పేరు బ‌య‌ట‌కు రాలేదు. చిన్న‌మ్మ అటు జైలు కెళ్లిపోగానే అదే స్కెచ్ ను వ‌ర్క‌వుట్ చేశారు ఆమె అనుచ‌రులు. శ‌శి చెప్పిన‌ట్టే న‌డుచుకున్నారు. చిన్న‌మ్మ ప్లాన్ ఎంత ప‌క్కాగా ఉంటుందో… ఆచ‌రించి చూపించారు.

శ‌శిక‌ళ వ్యూహ‌ర‌చ‌న‌లో భాగంగానే ప‌ళ‌నిస్వామి రాజ్ భ‌వ‌న్ కు వెళ్ల‌డం… గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావును క‌ల‌వ‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. అటు ప‌న్నీర్ సెల్వం కూడా గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసినా… ప‌ళ‌నిస్వామికే ఫ‌స్ట్ ప్రియారిటీ ద‌క్కింది. ఆయ‌నే సీఎం అయిపోయారు. చివ‌ర‌కు శశిక‌ళ చెప్పిన‌ట్టు న‌డుచుకునే ప్ర‌భుత్వం ఏర్పాటయ్యింది. జైలుకెళ్లినా స‌ర్కార్ పై ప‌ట్టు ఆమెదేన‌ని రుజువైంది. నిజానికి ఈ రేసులో చిన్న‌మ్మ ఓడిపోయారు…అంత‌వ‌ర‌కు కరెక్టే… కానీ సెల్వంను ముఖ్య‌మంత్రి కాకుండా అడ్డుకొని అంతిమ విజ‌యం త‌న‌దేన‌ని చాటుకున్నారు. ద‌టీజ్ చిన్న‌మ్మ‌!!!