అప్పుడు తిట్టి..ఇప్పుడు పూలబొకే ఇచ్చిన ఎమ్మెల్యే

0
46

Posted April 27, 2017 at 15:26


టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్,తహసీల్దార్ వనజాక్షి …ఈ రెండు పేర్లు గుర్తొస్తే ఇసుక తరలింపు యుద్ధం కళ్ల ముందు కదులుతుంది కదా.వాళ్ళు ఇద్దరూ ఇప్పుడు ఎదురు పడితే ఏమవుతుంది ? ఎడమొహం పెడమొహం గా వుంటారు అనుకుంటున్నారా? అదేమీ లేదు..అంతకన్నా మీరు వూహించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆ ఇద్దరూ నిజంగానే ఎదురు పడ్డారు.కానీ ఎక్కువమంది ఊహించినట్టు ఉప్పునిప్పు లా లేరు.పైగా ఎమ్మెల్యే చింతమనేని ఆమెకు పూలబొకే ఇచ్చి మరీ స్వాగతం పలికారు.

పశ్చిమగోదావరి జిల్లా,దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎంత దూకుడు మనిషో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అదే నియోజకవర్గ పరిధిలోని బాలసదన్ లో ఉంటున్న మేఘన అనే అమ్మాయిని వనజాక్షి దత్తత తీసుకున్నారు.ఈ కార్యక్రమం కోసం ఆమె హాస్టల్ కి వస్తుందన్న వార్త చింతమనేనికి తెలిసింది.దీంతో ఆయన అక్కడికి వచ్చారు.ఏమి జరుగుతుందో అని హడలిపోతున్న అధికారులకి షాక్ ఇస్తూ పూలబొకే తో ఆమెకి స్వాగతం పలికారు.ఈ దృశ్యాల్నిఅక్కడున్న వాళ్ళు ఆసక్తిగా గమనించారు.ఏమైనా చింతమనేని ఎవరికీ అర్ధం కాడబ్బా అనుకుంటూ అక్కడ నుంచి కదలివెళ్లారు.