చిరుకి అతిధి… ఎన్టీఆర్ అభిమాని

Posted September 30, 2016

 chiranjeevi friend radhika favorite hero ntr

టాలీవుడ్ ని మెస్మరైజ్ చేసిన జంటల్లో ఒకటి మెగాస్టార్ చిరంజీవి- రాధికల పెయిర్.. వాళ్లిద్దరు కలిసి నటించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో వారి మధ్య చిన్న చిన్న తగువులొచ్చినా స్నేహం చెక్కు చెదరలేదు. ఇప్పటికీ చిరు-రాధిక మధ్య మంచి స్నేహం ఉంది. చిరు కుంబంతోనూ రాధిక కు మంచి సంబంధాలున్నాయి. హైదరాబాద్ వస్తే చిరు ఇంట్లో అతిధిగా దిగేంత చనువుంది. ఎక్కువ సంబంధాలు అలాగే జరుగుతున్నాయి కూడా

కానీ ఇప్పటి తరం కథానాయకుల్లో రాధిక విపిరీతంగా అభిమానించేది ఎవరినో తెలుసా ! యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. ఓ సామాన్య ప్రేక్షకురాలిగా ఎన్టీఆర్ ని ఎంతగానో ఇష్టపడతారు ఆమె.. వీలైనంత వరకు ఎన్టీఆర్ సినిమాలు మిస్ కానివ్వరు . చివరకు ఎన్టీఆర్ తో ఫోటో తీసుకునే అవకాశాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు రాధిక.. ఆ విధంగా చిరు అతిధి .. ఎన్టీఆర్ అభిమాని అయ్యారు ఆవిడ ..